Purandeswari : అడుగు పెట్టగానే పరిణామాలు మార్చేసిన పురందరేశ్వరి – జనసేనకి పెద్ద దెబ్బ?
Purandeswari : ఇప్పుడు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ ఎవరు అంటే సోము వీర్రాజు అనేరు. కాదు.. ఇవాళ్టి నుంచి దగ్గుబాటి పురందేశ్వరి. ఆమె ఎవరో తెలుసు కదా. లెజెండ్ ఎన్టీఆర్ కూతురు. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చి బాగానే రాణించారు. ప్రస్తుతం ఆమెకే ఏపీ అధ్యక్ష బాధ్యతలను బీజేపీ అధిష్ఠానం అప్పగించింది. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. సోము వీర్రాజు ఏపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అసలు ఏపీలో బీజేపీ ఉందా.. లేదా అన్నట్టుగా ఉండేది పరిస్థితి. అందుకే ఏపీ బీజేపీలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది బీజేపీ హైకమాండ్.
అందుకే పురందేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించారు. దీంతో ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి ఏపీలో బీజేపీ, జనసేన రెండు పార్టీలు పొత్తులోనే ఉన్నాయి. కానీ.. పవన్ మాత్రం బీజేపీ అధికార కార్యక్రమాల్లో పాల్గొనరు. బీజేపీ కూడా జనసేన కార్యక్రమాల్లో పాల్గొనదు. ఏదో పొత్తు ఉందా అంటే ఉంది అన్నట్టుగానే ఇన్నిరోజులు సాగింది. కానీ.. ఇక నుంచి అలా ఉండకపోవచ్చు. పరిణామాలు అన్నీ మారొచ్చు. అందుకే కాబోలు.. ముందుగానే ఆమెకు అభినందులు తెలుపుతూ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనను రిలీజ్ చేశారు.ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి నియమితులైన పురందేశ్వరి గారికి హృదయపూర్వక అభినందనలు అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం ఉన్న పురందేశ్వరి గారు ఈ కొత్త బాధ్యతలో విజయవంతంగా ముందుకు సాగాలని భావిస్తున్నాను.
Purandeswari : పవన్ ఏం చెప్పారంటే?
ఏపీ ప్రయోజనాలు పరిరక్షించే దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే.. ఇన్ని రోజు సోము వీర్రాజు గురించి పెద్దగా పవన్ పట్టించుకోలేదు. దానికి కారణం.. సోము వీర్రాజు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడం. కానీ.. ఇప్పుడు పురందేశ్వరి రావడంతో మళ్లీ బీజేపీకి పవన్ దగ్గరయ్యే అవకాశం ఉంది. మరి.. పురందేశ్వరి ఏపీలో బీజేపీకి ఎలాంటి వైభవం తీసుకొస్తారో వేచి చూడాల్సిందే.