Asaduddin Owaisi : పాకిస్తాన్‌కు నీరు, వాణిజ్యం, విమాన సర్వీసులు నిలిపివేసినప్పుడు క్రికెట్ మ్యాచ్‌లు ఎందుకు : ఒవైసీ
Asaduddin Owaisi : భారత్ vs పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఆసదుద్దీన్ ఒవైసీ లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, పాకిస్తాన్‌పై కేంద్రం చూపుతోన్న విరోధ భావానికి అనుగుణంగా, క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం ఏమిటి? అని నిలదీశారు. పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్ల కుటుంబాలను ఉద్దేశిస్తూ, “ఆపరేషన్ సింధూర్ అంటూ పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. అదే నిజమైతే ఇప్పుడు పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లు చూడమని మృతుల కుటుంబాలకు చెబుతారా?” అంటూ ఒవైసీ కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Asaduddin Owaisi : పాకిస్తాన్‌కు నీరు, వాణిజ్యం, విమాన సర్వీసులు నిలిపివేసినప్పుడు క్రికెట్ మ్యాచ్‌లు ఎందుకు : ఒవైసీ
పాక్‌తో సంబంధాలపై కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించిన ఒవైసీ, విదేశాంగ విధానాల్లో అమెరికా ప్రభావం ఎక్కువైందని తెలిపారు. “వైట్‌హౌస్‌లో కూర్చున్నవాడు భారత సైన్యం కాల్పుల విరమణ ప్రకటిస్తే అదే జాతీయవాదమా?” అంటూ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు.ఒవైసీ వ్యాఖ్యలు లోక్‌సభలో చర్చకు దారితీయగా, పాక్‌తో సంబంధాల విషయంలో భారత ప్రభుత్వం స్పష్టమైన విధానం పాటించాల్సిన అవసరం ఉందని పలువురు ప్రతిపక్ష సభ్యులు సూచించారు.
ప్రస్తుతం భారత్–పాకిస్తాన్ మధ్య రాజకీయంగా, వ్యాపారంగా సంబంధాలు లేకున్నా, ఐసీసీ టోర్నీల్లో మాత్రం రెండు జట్లు ముఖాముఖి తలపడడంపై విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో రానున్న రోజులలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.
Tea : వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చల్లటి వాతావరణం లో మన శరీరం వెచ్చదనాన్ని వెతుక్కుంటుంది. మన శరీరం వేడిగా…
Rakhi Festival : శ్రావణ మాసంలో rakhi festival ప్రతి సంవత్సరం వచ్చే పౌర్ణమి తిధి రోజున రాఖీ పండుగ…
Indiramma Houses : ఈ రోజు ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన 5 లక్షల రూపాయలు…
Janhvi Kapoor : జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు ముంబైలో జన్మించింది. తల్లి…
Anasuya : తాజా ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ, తన కుటుంబ జీవితంలోని వాస్తవాలను, ప్రత్యేకంగా తన భర్తతో ఉన్న బంధాన్ని…
Hero Bike : భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్‌లో అధిక మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన hero glamour…
Nitya Menon : vijay sethupathi భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న అతికొద్దిమంది అద్భుతమైన నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు…
Google Pay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ పేమెంట్ యాప్స్ భారతదేశంలోని డిజిటల్ లావాదేవీల్లో…
This website uses cookies.