Asaduddin Owaisi : పాకిస్తాన్‌కు నీరు, వాణిజ్యం, విమాన సర్వీసులు నిలిపివేసినప్పుడు క్రికెట్ మ్యాచ్‌లు ఎందుకు : ఒవైసీ
ప్రధానాంశాలు:
పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌లు అవసరమా ? .. లోక్‌సభలో కేంద్రంపై ఒవైసీ ఆగ్రహం
Asaduddin Owaisi : పాకిస్తాన్‌కు నీరు, వాణిజ్యం, విమాన సర్వీసులు నిలిపివేసినప్పుడు క్రికెట్ మ్యాచ్‌లు ఎందుకు : ఒవైసీ
Asaduddin Owaisi : భారత్ vs పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఆసదుద్దీన్ ఒవైసీ లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, పాకిస్తాన్‌పై కేంద్రం చూపుతోన్న విరోధ భావానికి అనుగుణంగా, క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం ఏమిటి? అని నిలదీశారు. పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్ల కుటుంబాలను ఉద్దేశిస్తూ, “ఆపరేషన్ సింధూర్ అంటూ పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. అదే నిజమైతే ఇప్పుడు పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లు చూడమని మృతుల కుటుంబాలకు చెబుతారా?” అంటూ ఒవైసీ కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Asaduddin Owaisi : పాకిస్తాన్‌కు నీరు, వాణిజ్యం, విమాన సర్వీసులు నిలిపివేసినప్పుడు క్రికెట్ మ్యాచ్‌లు ఎందుకు : ఒవైసీ
Asaduddin Owaisi ఇది కరెక్టా..
పాక్‌తో సంబంధాలపై కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించిన ఒవైసీ, విదేశాంగ విధానాల్లో అమెరికా ప్రభావం ఎక్కువైందని తెలిపారు. “వైట్‌హౌస్‌లో కూర్చున్నవాడు భారత సైన్యం కాల్పుల విరమణ ప్రకటిస్తే అదే జాతీయవాదమా?” అంటూ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు.ఒవైసీ వ్యాఖ్యలు లోక్‌సభలో చర్చకు దారితీయగా, పాక్‌తో సంబంధాల విషయంలో భారత ప్రభుత్వం స్పష్టమైన విధానం పాటించాల్సిన అవసరం ఉందని పలువురు ప్రతిపక్ష సభ్యులు సూచించారు.
ప్రస్తుతం భారత్–పాకిస్తాన్ మధ్య రాజకీయంగా, వ్యాపారంగా సంబంధాలు లేకున్నా, ఐసీసీ టోర్నీల్లో మాత్రం రెండు జట్లు ముఖాముఖి తలపడడంపై విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో రానున్న రోజులలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.