Balka Suman : చెప్పుతో కొడతా.. సీఎం రేవంత్ రెడ్డి పై రెచ్చిపోయి కామెంట్స్ చేసిన బాల్క సుమన్.. వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Balka Suman : చెప్పుతో కొడతా.. సీఎం రేవంత్ రెడ్డి పై రెచ్చిపోయి కామెంట్స్ చేసిన బాల్క సుమన్.. వీడియో !

Balka Suman : చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు. మంచిర్యాల జిల్లాలో పార్లమెంట్ స్థాయి సమావేశంలో మాట్లాడుతూ చెప్పుతో కొడతా నా కొడకా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై అసభ్య పదజాలంతా వ్యాఖ్యలు చేయడంపై బాల్క సుమన్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణను […]

 Authored By aruna | The Telugu News | Updated on :5 February 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Balka Suman : చెప్పుతో కొడతా .. సీఎం రేవంత్ రెడ్డి పై రెచ్చిపోయి కామెంట్స్ చేసిన బాల్క సుమన్..!

Balka Suman : చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు. మంచిర్యాల జిల్లాలో పార్లమెంట్ స్థాయి సమావేశంలో మాట్లాడుతూ చెప్పుతో కొడతా నా కొడకా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై అసభ్య పదజాలంతా వ్యాఖ్యలు చేయడంపై బాల్క సుమన్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణను సాధించిన నాయకుడు కేసీఆర్ ను లంగా అని మాట్లాడుతున్నాడు. రండగాడు, హౌలే గాడు రేవంత్ రెడ్డి అని బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చెప్పు తీసుకొని కొట్టినా తప్పు లేదని చేతుల్లోకి చెప్పు తీసుకొని మరి బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నాం అంటూ మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి పదవిని బట్టి స్థాయిని బట్టి మాట్లాడాలని అన్నారు. రైతుబంధు డబ్బులు అడిగితే కాంగ్రెస్ మంత్రులు రైతులను చెప్పుతో కొడతామంటున్నారని ఆరోపించారు. ఆటో డ్రైవర్లు తిన్నది అరగక ధర్నాలు చేస్తున్నారని అహంకారంతో మాట్లాడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో రైతుబంధు కోసం విడుదల చేసిన రూ. 7,700 కోట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి రాఘవ కంస్ట్రక్షన్ కి కాంగ్రెస్ కాంట్రాక్టర్లకి జేబులోకి మలుపుకొని రైతుల నోట్లో మట్టి కొట్టారని ఆరోపణ చేశారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు అటు కేంద్రం గాని పక్క రాష్ట్రాల వాళ్లు కానీ మన ప్రాజెక్టుల వైపు చూడాలంటేనే భయపడ్డారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా రెండు నెలల్లోనే కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల అధికారాలను కేంద్రం చేతుల్లోకి పోయాయని అన్నారు. బీఆర్ఎస్ కుటుంబ పాలన అని విమర్శించారని ఒకే పార్లమెంట్ నియోజకవర్గంలో వినోద్, వివేక్ ఎమ్మెల్యేలు అయ్యారని, ఇప్పుడు తన కొడుకు వంశీకి ఎంపి టికెట్ కోసం ఆశపడటం కుటుంబ పాలన కాదా అనిపించారు. సూటు బూటు వేసుకొని షూట్ కేస్ రాజకీయాలతో రాజకీయాలను కలుషితం చేయడానికి కాకా కుటుంబ సభ్యులు మళ్ళీ బయలుదేరారని ఎద్దేవా చేశారు. పెద్దపల్లి పార్లమెంటరీ సామంత రాజుల వ్యవహరించాలని చూస్తున్నారని బాల్క సుమన్ వ్యాఖ్యనించారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది