Bandi Sanjay : పవన్ కళ్యాణ్ పై బండి సంజయ్ పంచ్.. రేవంత్ గురించి ఎవరో చెవిలో చెప్పారేమో..!
ప్రధానాంశాలు:
Bandi Sanjay : పవన్ కళ్యాణ్ పై బండి సంజయ్ పంచ్.. రేవంత్ గురించి ఎవరో చెవిలో చెప్పారేమో..!
Bandi Sanjay : నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ Pawan Kalyan సంధ్య థియేటర్ ఘటన మీద స్పందించిన విషయం తెలిసిందే. ఐతే ఈ క్రమంలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి గురించి పవన్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడని పవన్ అన్నారు. ఐతే ఈ విషయంపై బండి సంజయ్ పవన్ కళ్యాణ్ కి పంచ్ వేశారు .
Bandi Sanjay రేవంత్ రెడ్డి ఏ కోణంలో మంచిగా కనిపించారో..
లేటెస్ట్ గా పవన్ కామెంట్స్ పై స్పందించిన సంజయ్ రేవంత్ రెడ్డి లో ఏం మంచి కనిపించింది అని అన్నారు.పవన్ కి రేవంత్ రెడ్డి ఏ కోణంలో మంచిగా కనిపించారో అని అన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయనందుకు రేవంత్ రెడ్డి మంచిగా కనిపించాడా అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు ఎవరో చెవిలో చెప్పి ఉంటారని బండి సంజయ్ అన్నారు.
కాగా ఏపీలో బీజేపీ అలియన్స్ లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారన్న విషయం తెలిసిందే. మరి పవన్ మీద సంజయ్ చేసిన కామెంట్స్ పై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. Pawan Kalyan, Revanth Reddy, Bandi Sanjay, Telangana CM