Pawan Kalyan : గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా.. సధ్య థియేటర్ ఇష్యూ పవన్ కల్యాణ్ ఫస్ట్ రియాక్షన్..!
ప్రధానాంశాలు:
Pawan Kalyan : గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా.. సధ్య థియేటర్ ఇష్యూ పవన్ కల్యాణ్ ఫస్ట్ రియాక్షన్..!
Pawan Kalyan : సంధ్య థియేటర్ ఘటన అటు సినీ పరిశ్రమకు, తెలంగాణ ప్రభుత్వం మధ్య కాస్త దూరాన్ని పెంచే అవకాశాన్ని ఇచ్చింది. సంధ్య థియేటర్ ఘటన వల్ల ఒక మహిళ మృతి చెందగా ఆ టైం లో అల్లు అర్జున్ ర్యాలీ చేయడం వల్లే అది జరిగిందని అందరు అల్లు అర్జున్ దే తప్పని అన్నారు. ఐతే ఈ ఇష్యూపై రకరకాల వెర్షన్స్ అన్ని తెలిసిందే. ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. అల్లు అర్జున్ ఒక పూట జైలుకి కూడా పంపించారు. ఐతే అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించి ఇక మీదట బెనిఫిట్ షోస్ ఉండవని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఆ తర్వా ఎఫ్.డీ.సీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సినీ పెద్దలు సీఎం రేవంత్ తో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోస్ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని తేల్చి చెప్పారు.
Pawan Kalyan అభిమాని మృతి చెందిన విషయం తెలియగానే..
ఐతే ఇప్పటివరకు ఈ గొడవపై పవన్ కళ్యాణ్ స్పందించలేదు. ఐతే లేటెస్ట్ గా ఈ విషయంపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సంధ్య థియేటర్ ఘటన గోటితో పోయే దాన్ని గొడ్డలిదాకా తెచ్చారని అన్నారు. అభిమాని మృతి చెందిన విషయం తెలియగానే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలి.. మనవతా వృక్పథం లోపించినట్లైంది అంటూ ఇన్ డైరెక్ట్ గా అల్లు అర్జున్ చేసిన దానిపై తన అసంతృప్తిని వెల్లబుచ్చారు పవన్ కళ్యాణ్.
ఐతే ఈ ఇష్యూ జరిగిన టైం లో ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లి మళ్లీ అక్కడ నుంచి నెక్స్ట్ డే అమరావతి వచ్చారు పవన్. ఇప్పటిదాకా ఈ ఇష్యూపై నోరు విప్పని పవన్ తాజాగా మనవతా దృక్పథం అంటూ అల్లు అర్జున్ పైనే తప్పు ఉందన్నట్టు ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.