Bandi Sanjay :తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేని ఉత్సాహంతో బీజేపీ ఉంది అనడంలో సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎప్పుడు కూడా ఉందా లేదా అన్నట్లుగానే ఉంటూ వచ్చేది. కాని ఇప్పుడు తెలంగాణలో మాత్రం అధికార టీఆర్‌ఎస్ పార్టీకి మరియు కేసీఆర్ కు చుక్కలు చూపించడంలో సఫలం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఎంపిక అయిన తర్వాత పార్టీ జోరు పెరిగింది. బండి సంజయ్ తనకు వచ్చిన విశేష అధికారాలతో రాష్ట్ర ప్రభుత్వంను కేసీఆర్ ను చెడుగుడు ఆడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బండి సంజయ్ దూకుడు స్వభావం వల్ల పలు సందర్బాల్లో సీఎం కేసీఆర్ ఇబ్బంది పడ్డారు అనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో బీజేపీని దూకుడుగా తీసుకు వెళ్తున్న బండి సంజయ్ కొన్ని విషయాల్లో మాత్రం విఫలం అవుతున్నారు.
బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా అయిన తర్వాత వరుసగా విజయాలు దక్కాయి. దాంతో ఆయన పార్టీ పై మొత్తం పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలంగాణ బీజేపీ అనగానే గుర్తుకు వచ్చే పేరు కిషన్ రెడ్డి. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో నిలబెట్టిన కిషన్ రెడ్డి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తల్లో మరియు కేంద్రంలోని బీజేపీ అధినాయకత్వంలో కూడా కిషన్ రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. అలాంటి కిషన్ రెడ్డిని కలుపుకుని వెళ్లకుండా బండి సంజయ్ ఒంటెద్దు పోకడ నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
రాష్ట్ర నాయకత్వం అందరిని కలుపుకోవాల్సిందే. అలా కాదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బీజేపీ అధినాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సున్నితంగా వార్నింగ్ ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు కాని రాష్ట్ర బీజేపీ కార్యకర్తలు మాత్రం అదే జరిగితే మంచిదే అంటున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు మరియు మంచి ఫాలోయింగ్ ఉన్న కిషన్ రెడ్డిని పక్కకు పెట్టడం వల్ల ఖచ్చితంగా పార్టీకి మంచిది కాదంటున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.