రెడ్డిని పక్కన పెట్టి పరుగులు పెట్టాలనుకుంటున్న’బండి’పై అక్కడ ఇక్కడ అసంతృప్తి

Authored By Himanshi | The Telugu News | Published on: March 20, 2021, 5:59 pm

Bandi Sanjay :తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేని ఉత్సాహంతో బీజేపీ ఉంది అనడంలో సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎప్పుడు కూడా ఉందా లేదా అన్నట్లుగానే ఉంటూ వచ్చేది. కాని ఇప్పుడు తెలంగాణలో మాత్రం అధికార టీఆర్‌ఎస్ పార్టీకి మరియు కేసీఆర్‌ కు చుక్కలు చూపించడంలో సఫలం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ ఎంపిక అయిన తర్వాత పార్టీ జోరు పెరిగింది. బండి సంజయ్‌ తనకు వచ్చిన విశేష అధికారాలతో రాష్ట్ర ప్రభుత్వంను కేసీఆర్‌ ను చెడుగుడు ఆడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బండి సంజయ్ దూకుడు స్వభావం వల్ల పలు సందర్బాల్లో సీఎం కేసీఆర్ ఇబ్బంది పడ్డారు అనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో బీజేపీని దూకుడుగా తీసుకు వెళ్తున్న బండి సంజయ్‌ కొన్ని విషయాల్లో మాత్రం విఫలం అవుతున్నారు.

Bandi Sanjay : కిషన్‌ రెడ్డిని పక్కకు..

బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా అయిన తర్వాత వరుసగా విజయాలు దక్కాయి. దాంతో ఆయన పార్టీ పై మొత్తం పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలంగాణ బీజేపీ అనగానే గుర్తుకు వచ్చే పేరు కిషన్‌ రెడ్డి. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో నిలబెట్టిన కిషన్‌ రెడ్డి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తల్లో మరియు కేంద్రంలోని బీజేపీ అధినాయకత్వంలో కూడా కిషన్‌ రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. అలాంటి కిషన్‌ రెడ్డిని కలుపుకుని వెళ్లకుండా బండి సంజయ్ ఒంటెద్దు పోకడ నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

bandi sanjay

bandi sanjay

Bandi Sanjay  : బండికి సున్నితంగా వార్నింగ్‌..

రాష్ట్ర నాయకత్వం అందరిని కలుపుకోవాల్సిందే. అలా కాదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బీజేపీ అధినాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కు సున్నితంగా వార్నింగ్ ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు కాని రాష్ట్ర బీజేపీ కార్యకర్తలు మాత్రం అదే జరిగితే మంచిదే అంటున్నారు. పార్టీ సీనియర్‌ నాయకుడు మరియు మంచి ఫాలోయింగ్ ఉన్న కిషన్‌ రెడ్డిని పక్కకు పెట్టడం వల్ల ఖచ్చితంగా పార్టీకి మంచిది కాదంటున్నారు.

Himanshi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp