bandi sanjay
Bandi Sanjay : తెలంగాణ సీఎం కేసీఆర్ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పులో కాలు వేశాడా అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. ముల్లును ముల్లుతో తీయాలి అనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ను ఆయన భాషలోనే బండి సంజయ్ డీల్ చేయాలని భావించాడు. కాని అది సాధ్యం కావడం లేదు. బండి సంజయ్ ఇటీవల కేసీఆర్ ను వ్యక్తిగత దూషణలతో విమర్శలు చేయడం జరిగింది. దాంతో అప్పటి నుండి ఆయనకు జనాలు చుక్కులు చూపిస్తున్నారు. ఆయన విషయంలో కేసీఆర్ అభిమానులు వ్యవహరిస్తున్న తీరుతో బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్తితి ఏర్పడింది. నిజామాబాద్ లో బండి సంజయ్ ఎదుర్కొన్న సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్ ను తక్కువ చేసేందుకు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కేసీఆర్ ను వ్యక్తిగతంగా దూషించడంతో పాటు ఆయన్ను జనాల్లో తక్కువ చేసి మాట్లాడేందుకు ప్రయత్నించిన బండి సంజయ్ ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో తిరగడం కూడా కష్టం గా మారింది. కేసీఆర్ విషయంలో బండి సంజయ్ తక్కువ అంచనా వేశాడు. ఆయనపై జనాల్లో వ్యతిరేకత ఉందని భావిస్తున్న బండి సంజయ్ అనవసరపు విమర్శలు చేస్తున్నాడు అంటూ టీఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
bandi sanjay self goal about telangana cm kcr,
కేసీఆర్ విషయంలో విమర్శలు చేసే సమయంలో కాస్త హద్దుల్లో ఉండాలంటూ ఈ సందర్బంగా సొంత పార్టీ నాయకులు స్వయంగా బండికి సూచిస్తున్నారు. నేడు కాకుంటే రేపు కేంద్రంలో కేసీఆర్ మోడీతో సన్నిహిత్యంగా మారే అవకాశం ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుండి పోటీ చేసే ఎంపీలు బీజేపీకి మద్దతు ఇవ్వాల్సి రావచ్చు. కనుక కేసీఆర్ విషయంలో మరీ వ్యక్తిగత విమర్శలు సరి కావు అంటూ బీజేపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.