KTR : కేటీఆర్ కేబినేట్ సపరేట్? ఇప్పుడు ఉన్నవాళ్లు సర్దుకోవాల్సిందేనా?
ప్రస్తుతం తెలంగాణలో ఒకటే హాట్ టాపిక్. అదే కేటీఆర్ సీఎం గురించి. సీఎం కేసీఆర్ త్వరలోనే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. మంత్రి కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ముహూర్తం కూడా ఖరారు అయిందని.. వచ్చే నెలలోనే తారక రాముడి పట్టాభిషేకం ఉంటుందని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇందులో నిజమెంత.. అబద్ధమెంత.. అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. ఎందుకంటే.. అధికారిక ప్రకటన రానంతవరకు ఇవన్నీ పుకార్లుగానే మిగిలిపోతాయి. కాకపోతే సోషల్ మీడియాతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో కూడా కేటీఆర్ ముఖ్యమంత్రికి సంబంధించిన వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో తెలంగాణ ప్రజలు కూడా ఈ వార్తలను నమ్మాల్సి వస్తోంది.
కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి?
కేటీఆర్ కు సీఎం అయ్యే అర్హతలన్నీ ఉన్నాయి. ఆయన సీఎం అయితే ఇంకా తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుంది.. అంటూ కేటీఆర్ జపాన్ని స్టార్ట్ చేశారు మంత్రులు. ఆ తర్వాత ఇతర నాయకులు, ఎమ్మెల్యేలు కూడా వాళ్లకు వంతు పాడారు. కేటీఆర్ కాబోయే సీఎం అంటూ ముందు నుంచే కాకా పట్టారు. కానీ.. తాజాగా ప్రచారమవుతున్న వార్త ఏంటంటే… కేవలం సీఎం కుర్చి మాత్రమే మారడం కాదు.. కేబినేట్ కూడా మారబోతోందట.
ప్రస్తుతం ఉన్నవాళ్లంతా కేసీఆర్ కేబినేట్ మంత్రులు. కానీ.. కేటీఆర్ సీఎం అయ్యాక తన కేబినేట్ ను నియమించుకుంటారంటూ వార్తలు వస్తున్నాయి. తన అభిప్రాయాలకు మ్యాచ్ అయ్యే నేతలను కేటీఆర్ మంత్రిగా నియమించుకుంటారంటూ వార్తలు వస్తున్నాయి.
ఒకవేళ కేటీఆర్ కేబినేట్ ను పూర్తిగా ప్రక్షాళన చేస్తే ఇప్పుడు ఉన్న మంత్రుల సంగతి ఏంటి? మరి వీళ్లంతా సర్దుకోవాల్సిందేనా? కొత్త వాళ్లకు చాన్స్ ఇస్తే ఎవరికి కేటీఆర్ ప్రాధాన్యత ఇస్తారు. అసంతృప్తులకు ఈసారి చోటు ఉంటుందా? ఇదిగో ఇలాంటి సమీకరణనలతో టీఆర్ఎస్ నేతలు కూడా ఫుల్లు బిజీగా ఉన్నారు.