KCR : మార్చి తర్వాత కేసీఆర్ పట్టిందల్లా బంగారమేనట? మార్చి నుంచి కేసీఆర్ కు మహర్దశ?
సీఎం కేసీఆర్ జాతకం గురించి.. ఆయన జ్యోతిషం గురించి చాలాసార్లు ఎన్నో చర్చలు జరిగాయి. తెలంగాణ ఉద్యమ సమయం నుంచే చర్చలు జోరుగా సాగాయి. 2014 ఎన్నికల్లో గెలిచి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని.. మూడు నెలల ముందే.. ధర్మపురికి చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు గొల్లపల్లి సంతోశ్ కుమార్ శర్మ తెలియజేశారు. అప్పటి నుంచి శర్మ ఏది చెబితే అది జరుగుతోంది.
సీఎం కేసీఆర్.. 1954 ఫిబ్రవరి 17న జన్మించారు. అశ్లేష జన్మనక్షత్రం, కర్కటక రాశి, మేష లగ్నంలో కేసీఆర్ జన్మించారు. కేసీఆర్ కు ధన స్థానంలో గురువు ఉంటాడు. మూడింట కేతువు, ఆ తర్వాత నాలుగో స్థానంలో చంద్రుడు, ఏడో స్థానంలో శని, ఎనిమిదో స్థానంలో కుజుడు, తొమ్మిదో స్థానంలో రాహు, 11వ స్థానంలో సుర్యుడు, శుక్ర, బుధుడి గ్రహాలు ఉంటాయి. 2006లో ప్రారంభమైన రాహుదశ కేసీఆర్ కు బాగా కలిసివచ్చింది. ఆ రాహు మహర్దశలో ప్రస్తుతం శుక్ర అంతర్దశ నడుస్తోంది. ఈ అంతర్దశ వచ్చే మార్చి 26 వరకు మాత్రమే ఉంటాయి.
మార్చి 26 తర్వాత కేసీఆర్ కు సూర్య అంతర్దశ ప్రారంభం
వచ్చే మార్చి 26 తర్వాత నుంచి సీఎం కేసీఆర్ కు సూర్య అంతర్దశ ప్రారంభం కానుంది. ఆయన జాతకం ప్రకారం… సూర్యుడు సంతాన కారకుడై లాభ స్థానంలో ఉండటం వలన… పదవుల్లో మార్పు ఉండబోతున్నాయి. ఈ మహర్దశ వల్ల వచ్చే మార్పుల వల్ల లాభమే ఉంటుంది. సూర్యుడు 11వ ఇంట ఉండటం వల్ల ఈ దశలో జరిగే మార్పులు అనుకూలమైనవిగా ఉంటాయి.
మార్చి తర్వాత అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో గురువు 8 వ ఇంట ఉండటం వల్ల… ఈ సమయంలోనే ఖచ్చితంగా మార్పు సంభవించనున్నది. అలాగే.. ఈ దశవల్ల కేసీఆర్ సంతానానికి మేలు జరగనున్నది.
అంటే.. ప్రస్తుతం కేసీఆర్ కు కొన్ని సమస్యలు వేధిస్తున్నప్పటికీ.. మార్చి 2 తర్వాత ఆయనకు మహర్దశ రావడం అలాగే.. ఆయన సంతానానికి కూడా మేలు జరిగే నిర్ణయాలను ఆయన తీసుకుంటారు అనేది పండితుల విశ్లేషణ.
ఎలాగూ.. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఈ సమయంలోనే అంటే మార్చి తర్వాతనే కేసీఆర్.. కేటీఆర్ కు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించి తాను జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.