Bhatti Vikramarka : జన జాతర సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అవ‌మానం.. డ్రైవర్ ను కొట్టిన పోలీసులు… వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bhatti Vikramarka : జన జాతర సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అవ‌మానం.. డ్రైవర్ ను కొట్టిన పోలీసులు… వీడియో !

 Authored By ramu | The Telugu News | Updated on :7 April 2024,1:00 pm

Bhatti Vikramarka : నిన్న రాత్రి తెలంగాణ రాష్ట్రంలోని తుక్కుగూడలో జన జాతర భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ భారీ బహిరంగ సభకు అతిథులుగా రాజీవ్ గాంధీ కూడా హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. అయితే జన జాతర భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఘోర అవమానం జరిగిందని చెప్పాలి. ఈ భారీ బహిరంగ సభకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాన్వాయి ని అనుమతించకుండా రాచకొండ పోలీస్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారు.

Bhatti Vikramarka : డ్రైవర్ ఐడి కార్డు గుంజుకున్న సీపీ…

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వాహనం అని చెప్పిన సరే సభలోకి వెళ్ళనివ్వకుండా , వాహనానికి పాస్ ఉందని చెబుతున్న వినకుండా డ్రైవర్ శ్రీనివాస పై రాచకొండ సీపీ చేయి చేసుకున్నారు. డ్రైవర్ శ్రీనివాస్ సమాధానం చెబుతున్న వినకుండా ఆగ్రహంతో జేబులో ఉన్న ఐడి కార్డు సైతం సీపీ గుంజుకున్నట్లు సమాచారం . దీంతో పోలీసులు సభా ప్రాంగణంలోకి డిప్యూటీ సీఎం వాహనాన్ని రానివ్వకుండా పక్కన ఆపేశారు.

Bhatti Vikramarka జన జాతర సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అవ‌మానం డ్రైవర్ ను కొట్టిన పోలీసులు

Bhatti Vikramarka : జన జాతర సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అవ‌మానం.. డ్రైవర్ ను కొట్టిన పోలీసులు…!

ఇక ఈ ఘటనకు సంబంధించి చిత్రీకరించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. అంతేకాక వీడియో తీస్తున్న వ్యక్తులపై కూడా పోలీసులు చేయి చేసుకోవడం గమనార్హం. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ తెలంగాణ రాజకీయాల్లో సెన్సేషన్ గా మారింది.దీంతో నేటి జనులు గుంపు మేస్త్రిని గుడ్డిగా నమ్మితే బట్టి కి జరగాల్సిన పని జరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది