Vivek To Join in Congress : నిన్నామొన్నటి వరకు బీజేపీ తెలంగాణలో చాలా స్ట్రాంగ్ గా ఉండేది. ఎంతలా అంటే వచ్చే ఎన్నికల్లో గెలిచేంతలా తెలంగాణలో బీజేపీ కార్యక్రమాలు చేపట్టింది. తెలంగాణ జనాలు కూడా బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీనే అనుకున్నారు. అసలు తెలంగాణలో బీజేపీ అంతలా బలపడటానికి కారణమే బండి సంజయ్. ఎప్పుడైతే బండి సంజయ్ ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నిర్మించారో అప్పటి నుంచి తెలంగాణలో బీజేపీ బాగా పుంజుకుంది. ఉపఎన్నికల్లోనూ సత్తా చాటింది. దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలవడంతో పాటు తెలంగాణలో బీజేపీ పుంజుకోవడంతో ఇక తెలంగాణలో బీజేపీకి ఎదురు లేదు అని బీజేపీ నేతలు అనుకున్నారు.
కానీ.. ఇటీవల బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో పాటు పార్టీలో చేరుతున్న వాళ్లకు, సీనియర్లకు మధ్య అస్సలు పొసగడం లేదు. దీంతో పార్టీలో చేరిన నేతలు అసలు ఎందుకు బీజేపీలోకి చేరామా అని తలలు బాదుకుంటున్నారట. చాలామంది బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి బీజేపీలో చేరారు. కానీ.. ఇప్పటి వరకు వాళ్లను ఆ పార్టీలో పట్టించుకునే నాథుడే లేడు. కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అయ్యాక అస్సలే పట్టించుకోవడం లేదు నేతలను. అందుకే పలువురు సీనియర్ నేతలు ఎన్నికల వేళ వేరే పార్టీల వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి ఘర్ వాపసీ పేరుతో ఓ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అంటే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు వేరే పార్టీలో చేరిన వారు.. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకునే కార్యక్రమం అన్నమాట. ఆ కార్యక్రమానికి బాగానే రెస్పాన్స్ వస్తోంది.
కాంగ్రెస్ ను వీడి వేరే పార్టీల్లో చేరిన ఇతర నేతలు తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. అలాగే.. పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ కూడా త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత అని తెలుసు కదా. ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. అందులోనూ ఉండలేక.. మళ్లీ కాంగ్రెస్ లో చేరి చివరికి బీజేపీలో చేరారు. వేరే పార్టీల నుంచి బీజేపీలో చేరిన వాళ్లకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. అలాగ.. కవిత లిక్కర్ కేసులోనూ బీజేపీ హైకమాండ్ వ్యవహరించిన తీరు చాలామంది బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదు. అందుకే వివేక్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరేందుకు ప్రయత్నిస్తున్నారట. ఆయన ఇదివరకు కాంగ్రెస్ నుంచే పెద్దపల్లి నుంచి ఎంపీ అయ్యారు. మళ్లీ ఆయనకు టికెట్ హామీ వస్తే కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.