Vivek To Join in Congress : బీజేపీకి మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి వివేక్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vivek To Join in Congress : బీజేపీకి మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి వివేక్?

 Authored By kranthi | The Telugu News | Updated on :28 August 2023,5:00 pm

Vivek To Join in Congress : నిన్నామొన్నటి వరకు బీజేపీ తెలంగాణలో చాలా స్ట్రాంగ్ గా ఉండేది. ఎంతలా అంటే వచ్చే ఎన్నికల్లో గెలిచేంతలా తెలంగాణలో బీజేపీ కార్యక్రమాలు చేపట్టింది. తెలంగాణ జనాలు కూడా బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీనే అనుకున్నారు. అసలు తెలంగాణలో బీజేపీ అంతలా బలపడటానికి కారణమే బండి సంజయ్. ఎప్పుడైతే బండి సంజయ్ ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నిర్మించారో అప్పటి నుంచి తెలంగాణలో బీజేపీ బాగా పుంజుకుంది. ఉపఎన్నికల్లోనూ సత్తా చాటింది. దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలవడంతో పాటు తెలంగాణలో బీజేపీ పుంజుకోవడంతో ఇక తెలంగాణలో బీజేపీకి ఎదురు లేదు అని బీజేపీ నేతలు అనుకున్నారు.

కానీ.. ఇటీవల బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో పాటు పార్టీలో చేరుతున్న వాళ్లకు, సీనియర్లకు మధ్య అస్సలు పొసగడం లేదు. దీంతో పార్టీలో చేరిన నేతలు అసలు ఎందుకు బీజేపీలోకి చేరామా అని తలలు బాదుకుంటున్నారట. చాలామంది బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి బీజేపీలో చేరారు. కానీ.. ఇప్పటి వరకు వాళ్లను ఆ పార్టీలో పట్టించుకునే నాథుడే లేడు. కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అయ్యాక అస్సలే పట్టించుకోవడం లేదు నేతలను. అందుకే  పలువురు సీనియర్ నేతలు ఎన్నికల వేళ వేరే పార్టీల వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి ఘర్ వాపసీ పేరుతో ఓ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అంటే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు వేరే పార్టీలో చేరిన వారు.. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకునే కార్యక్రమం అన్నమాట. ఆ కార్యక్రమానికి బాగానే రెస్పాన్స్ వస్తోంది.

Vivek To Join in Congress

Vivek To Join in Congress : బీజేపీకి మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి వివేక్?

Vivek To Join in Congress : రేవంత్ ఘర్ వాపసీ ప్రయత్నం ఫలిస్తోందా?

కాంగ్రెస్ ను వీడి వేరే పార్టీల్లో చేరిన ఇతర నేతలు తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. అలాగే.. పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ కూడా త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత అని తెలుసు కదా. ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. అందులోనూ ఉండలేక.. మళ్లీ కాంగ్రెస్ లో చేరి చివరికి బీజేపీలో చేరారు. వేరే పార్టీల నుంచి బీజేపీలో చేరిన వాళ్లకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. అలాగ.. కవిత లిక్కర్ కేసులోనూ బీజేపీ హైకమాండ్ వ్యవహరించిన తీరు చాలామంది బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదు. అందుకే వివేక్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరేందుకు ప్రయత్నిస్తున్నారట. ఆయన ఇదివరకు కాంగ్రెస్ నుంచే పెద్దపల్లి నుంచి ఎంపీ అయ్యారు. మళ్లీ ఆయనకు టికెట్ హామీ వస్తే కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది