Allu Arjun : 69వ జాతీయ ఫిలిం అవార్డ్స్ లో తెలుగు ఇండస్ట్రీ తన సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తెలుగు ఇండస్ట్రీకి చెందిన హీరోలకు ఉత్తమ నటుడిగా అవార్డు రాలేదు. కానీ.. తొలిసారిగా పుష్ప సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. దీంతో సర్వత్రా ఈ అవార్డు గురించి చర్చ నడుస్తోంది. అసలు.. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా రాని అవార్డు ఇప్పుడెలా వచ్చింది. ఒక మగధీర, ఒక బాహుబలి, ఒక ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలు ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చాయి.
అయినా కూడా ఆ సినిమాల్లో నటించిన హీరోలకు రాని జాతీయ అవార్డు పుష్ప సినిమాలో నటించిన అల్లు అర్జున్ కు ఎలా వచ్చింది అని జనాలు గుసగుసలాడుతున్నారు. అంతే కాదు.. ఈ తరం వదిలేస్తే.. ఒకప్పటి తరం అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీని కాపాడిన తరం మహా నటులు సీనియర్ ఎన్టీఆర్ కు కూడా ఇప్పటి వరకు ఉత్తమ నటుడిగా అవార్డు రాలేదు. ఏఎన్నార్, కృష్ణ, మోహన్ బాబు, శోభన్ బాబు.. ఇలా ఆ తరం నటులకు ఎవ్వరికీ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రాలేదు. అంటే.. ఆ తరం నటుల కంటే కూడా అల్లు అర్జున్ తోపు నటుడా అంటూ సినిమా విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.
చివరకు కొన్నేళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీని ఏలిన మెగాస్టార్ చిరంజీవికి కూడా ఎప్పుడూ జాతీయ అవార్డు రాలేదు. ఆయన తరంలోని ఏ నటుడికి కూడా అవార్డు రాలేదు. ఇక.. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపును తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. మరి.. ఆ సినిమాలో నటించిన హీరోల కంటే కూడా అల్లు అర్జున్ అంత గొప్పగా ఏం నటించారు. అసలు ఆ సినిమాలో ఏముందని.. ఏం అంతలా నటించారని అల్లు అర్జున్ కు ఆ అవార్డు వచ్చిందంటూ ఫిలిం నగర్ లో చర్చ నడుస్తోంది. చూద్దాం మరి.. ఈ అవార్డు వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో?
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.