BRS 25 Years Celebration : ఆనాడైనా.. ఈనాడైనా.. ఏనాడైనా తెలంగాణకు కాంగ్రెస్సే విలన్ : కేసీఆర్
BRS 25 Years Celebration : ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణకు Telangana విలన్ నెంబర్ వన్ Congress Party కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పార్టీనే విలన్.. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీనే ప్రధాన శత్రువు అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్, టీడీపీ నేతలు పదవుల కోసమే నోరు మూసుకున్నారని, తెలంగాణ పేరు మెన్షన్ చేసినా శాసనసభలో నిషేధం చేసేంతవరకు వెళ్ళారని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ కోసం గులాబీ జెండా ఎగురేసి, పదవులను త్యాగం చేసిన వారు బీఆర్ఎస్ కార్యకర్తలేనని గర్వంగా పేర్కొన్నారు.
BRS 25 Years Celebration : ఆనాడైనా.. ఈనాడైనా.. ఏనాడైనా తెలంగాణకు కాంగ్రెస్సే విలన్ : కేసీఆర్
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తీవ్రంగా విమర్శించారు. రైతు బంధు, పెన్షన్, విద్యా కార్డులు, స్కూటీలు, రుణ మాఫీ వంటి వాగ్దానాలు చేసినా ఒక్కదానినీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. పబ్లిక్‌ను మోసం చేసేందుకు కాంగ్రెస్ నేతలు బూటకపు హామీలు ఇచ్చారని, నాణ్యమైన పాలన అంటే ఎలా ఉండాలో తెలియని వారు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. ప్రత్యేకించి ఉచిత బస్సు వాగ్దానాన్ని ఎత్తిచూపుతూ, అది ప్రజలకు అసలే ఉపయోగపడటం లేదని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు నష్టంతో కూడుకున్నా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతుగా నిలిచిందని, పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేసినట్లు కేసీఆర్ గుర్తు చేశారు. తాము ఇచ్చిన హామీలను పాటిస్తూ, ప్రజలకు ఉపయోగపడే విధంగా పాలన సాగించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలకు ప్రజలు మళ్లీ బలికాకూడదని, నిజమైన అభివృద్ధి మార్గం బీఆర్ఎస్ ద్వారానే సాధ్యమని కేసీఆర్ ప్రజలను విజ్ఞప్తి చేశారు.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.