BRS 25 Years Celebration : ఆనాడైనా.. ఈనాడైనా.. ఏనాడైనా తెలంగాణకు కాంగ్రెస్సే విలన్ : కేసీఆర్‌

 Authored By ramu | The Telugu News | Updated on :27 April 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  BRS 25 Years Celebration : ఆనాడైనా.. ఈనాడైనా.. ఏనాడైనా తెలంగాణకు కాంగ్రెస్సే విలన్ L కేసీఆర్‌

BRS 25 Years Celebration : ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణకు Telangana విలన్‌ నెంబర్‌ వన్‌ Congress Party కాంగ్రెస్‌ పార్టీయేనని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకల సందర్భంగా వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పార్టీనే విలన్.. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీనే ప్రధాన శత్రువు అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌, టీడీపీ నేతలు పదవుల కోసమే నోరు మూసుకున్నారని, తెలంగాణ పేరు మెన్షన్ చేసినా శాసనసభలో నిషేధం చేసేంతవరకు వెళ్ళారని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ కోసం గులాబీ జెండా ఎగురేసి, పదవులను త్యాగం చేసిన వారు బీఆర్ఎస్ కార్యకర్తలేనని గర్వంగా పేర్కొన్నారు.

BRS 25 Years Celebration : ఆనాడైనా.. ఈనాడైనా.. ఏనాడైనా తెలంగాణకు కాంగ్రెస్సే విలన్ : కేసీఆర్‌

BRS 25 Years Celebration : ఆనాడైనా.. ఈనాడైనా.. ఏనాడైనా తెలంగాణకు కాంగ్రెస్సే విలన్ : కేసీఆర్‌

BRS 25 Years Celebration ఆనాడైనా.. ఈనాడైనా.. ఏనాడైనా తెలంగాణకు కాంగ్రెస్సే విలన్

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తీవ్రంగా విమర్శించారు. రైతు బంధు, పెన్షన్, విద్యా కార్డులు, స్కూటీలు, రుణ మాఫీ వంటి వాగ్దానాలు చేసినా ఒక్కదానినీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. పబ్లిక్‌ను మోసం చేసేందుకు కాంగ్రెస్ నేతలు బూటకపు హామీలు ఇచ్చారని, నాణ్యమైన పాలన అంటే ఎలా ఉండాలో తెలియని వారు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. ప్రత్యేకించి ఉచిత బస్సు వాగ్దానాన్ని ఎత్తిచూపుతూ, అది ప్రజలకు అసలే ఉపయోగపడటం లేదని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు నష్టంతో కూడుకున్నా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతుగా నిలిచిందని, పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేసినట్లు కేసీఆర్ గుర్తు చేశారు. తాము ఇచ్చిన హామీలను పాటిస్తూ, ప్రజలకు ఉపయోగపడే విధంగా పాలన సాగించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలకు ప్రజలు మళ్లీ బలికాకూడదని, నిజమైన అభివృద్ధి మార్గం బీఆర్ఎస్ ద్వారానే సాధ్యమని కేసీఆర్ ప్రజలను విజ్ఞప్తి చేశారు.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి