Osmania New Hospital : 2700 కోట్ల ఖ‌ర్చుతో ఉస్మానియా కొత్త ఆసుపత్రి భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన..!

Authored By Tandu Ramalingaiah | The Telugu News | Published on: January 31, 2025, 4:40 pm
  •  Osmania New Hospital : 2700 కోట్ల ఖ‌ర్చుతో ఉస్మానియా కొత్త ఆసుపత్రి భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన..!

Osmania New Hospital : శతాబ్ద కాలపు చరిత.. రాబోయే వందేళ్ల పాటు సేవలు అందించబోయే Osmania Hospital ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నూతన నిర్మాణ మహోజ్వల ఘట్టానికి అడుగుపడింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి Revanth reddy గారు ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, సలహాదారులు కే.కేశవరావు గారు, వేం నరేందర్ రెడ్డి గార్లతో కలిసి గోషామహల్ స్టేడియం ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చారణల కొత్త భవనాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.

Osmania New Hospital : 2700 కోట్ల ఖ‌ర్చుతో ఉస్మానియా కొత్త ఆసుపత్రి భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన..!

Osmania New Hospital : 2700 కోట్ల ఖ‌ర్చుతో ఉస్మానియా కొత్త ఆసుపత్రి భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన..!

సందడిగా సాగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, వైద్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అప్జల్‌గంజ్‌లోని ప్రస్తుత ఆసుపత్రిని మరింత ఆధునిక సౌకర్యాలతో వచ్చే వందేళ్లకు సరిపడా మౌలిక సదుపాయాలతో కొత్త ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరగడం పట్ల వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు. మొత్తంగా 26 ఎకరాల ప్రాంగణంలో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం మేరకు భవన నిర్మాణాలు చేపట్టనుండగా, ఈ ఆసుపత్రిలో 2 వేల పడకలతో 29 మేజర్, 12 మైనర్ ఆపరేషన్ థియేటర్స్ వంటి సర్వ హంగులను సమకూర్చనున్నారు.

ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, వైద్యులతో కలిసి ఆసుపత్రి నమూనాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూ గారితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tandu Ramalingaiah

Author Bio Info : Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "Karthika Deepam 2 Today Episode November 16 2026 : పారిజాతం కిడ్నాప్.. జ్యోత్స్నను విడదీయడానికి మాలిని మాస్టర్ ప్లాన్.. సూరజ్‌కు బిగ్ షాక్!"

  2. "Gold Rate Today : బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. వరుసగా దిగొస్తున్న ధరలు.. 2026 నవంబర్ 16న తాజా రేట్లు ఇవే!"

  3. "Cyclone Akvan 2026 : ఏపీ వైపు దూసుకొస్తున్న మరో తుఫాన్.. నవంబర్ 19, 20 తేదీల్లో అతి భారీ వర్షాలు..!"

  4. "Electricity Units : ఒక యూనిట్ కరెంట్ అంటే ఎంత? మీ ఇంట్లో ఏ పరికరం ఎన్ని యూనిట్ల కరెంట్ వాడుతుంది? ఈ లెక్క తెలిస్తే బిల్లు తగ్గించుకోవచ్చు!"

  5. "Koti Somavaram 2026 : నేడు కార్తీక మాసం కోటి సోమవారం.. శివుడికి ఇలా పూజ చేస్తే కోటి రెట్ల పుణ్యఫలం..!"

  6. "Today Horoscope : 16 నవంబర్ 2026 సోమవారం ఈ రోజు మీ రాశి ఫలాలు..!"

  7. "TDP YSRCP : ఏపీలో అనూహ్య పరిణామం.. అక్క‌డ ఒక్కటైన టీడీపీ, వైసీపీ..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp