Home » Exclusive » Congress New Leader Name For Khammam Mp Ticket
Exclusive

khammam MP Ticket : ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ రేసులో కొత్త పేరు… అతనికే ఇచ్చే అవకాశం..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: April 10, 2024, 9:30 pm
Advertisement

khammam MP Ticket : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల జోరు కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ పై గత కొద్ది రోజులుగా సస్పెన్షన్ కొనసాగుతూ వస్తుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి ఖమ్మం ఎంపీ టికెట్ ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య నందిని ఆశిస్తుండగా , మరోవైపు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా ఈ రేసులో ఉన్నారు. మరో ముఖ్య నేత పేరు కూడా మొన్నటి వరకు ఈ రేసులో వినబడింది. ఇది ఇలా సాగుతుండగా ఇటీవల అనూహ్యంగా నామా నాగేశ్వరరావు పేరు తెరపైకి రావడం జరిగింది. నామా నాగేశ్వర త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారని, ఖమ్మం ఎంపీ టికెట్ అతనికే ఇస్తారంటూ ప్రచారాలు కూడా జరిగాయి. ఈ విధంగా ఖమ్మం ఎంపీ టికెట్ పై భారీ సందిగ్ధత నెలకొనగా తాజాగా ఈ రేసు లో మరో పేరు తెరపైకి వచ్చింది

Advertisement

khammam MP Ticket : రేవంత్ రెడ్డి సన్నిహితుడికి ఇచ్చే అవకాశం…

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ అనూహ్యంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన కమ్మ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు అయినటువంటి మండవ వెంకటేశ్వరరావుకు ఖరారు అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఖమ్మంలో ఇద్దరు కీలక నేతలు పోటీపడుతున్నన నేపథ్యంలో స్థానికేతరుడిని కాంగ్రెస్ సర్కార్ రంగంలోకి దింపినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఖమ్మం జిల్లా స్థానిక నేతలు ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతుండటంతో ఆ టికెట్ ను ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇచ్చిన , మరొకరు అసంతృప్తి చెందే అవకాశం ఉంటుంది. అంతేకాక పోటీ పడుతున్న ఇద్దరు నాయకులు కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైన వారు కావడంతో ఎవరిని కాదనలేని పరిస్థితి.

khammam MP Ticket : ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ రేసులో కొత్త పేరు… అతనికే ఇచ్చే అవకాశం..!

Advertisement

దీంతో బాగా ఆలోచించిన కాంగ్రెస్ అధిష్టానం ఖమ్మం కాంగ్రెస్ టికెట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడు మండవ వెంకటేశ్వరరావుకి ఇవ్వడం వలన సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ టికెట్ పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ కచ్చితంగా మండవ వెంకటేశ్వరరావుకు అధిష్టానం టికెట్ ఇస్తుందని పలువురు తెలియజేస్తున్నారు. మరి ఈ స్థానం నుండి హస్తం పార్టీ ఎవరిని బరిలో దింపుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే…

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి