CBI Court : దోషిగా మైనింగ్ రాజు..హైదరాబాద్ సీబీఐ కోర్టు సంచలన తీర్పు

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on: May 6, 2025, 7:00 pm

CBI Court : హైదరాబాద్ సీబీఐ కోర్టు ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఐదుగురిని దోషులుగా తేల్చిన కోర్టు వారికి శిక్ష ఖరారు చేసింది. ఏ1గా ఉన్న బీవీ శ్రీనివాస్ రెడ్డికి, ఏ2గా ఉన్న మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి, ఏ3 వి.డి. రాజగోపాల్, ఆయన పీఏ అయిన ఏ7 అలీఖాన్‌లకు కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున జరిమానా కూడా విధించింది. అలాగే ఓబులాపురం మైనింగ్ కంపెనీని ఐదో దోషిగా కోర్టు గుర్తించింది.

ఇక తీర్పు సమయంలో జడ్జి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. “మీరు యావజ్జీవ శిక్షకు కూడా అర్హులే. పదేళ్ల శిక్ష ఎందుకు విధించకూడదు?” అని వ్యాఖ్యానించారు. దేశ ఆస్తులను దోచుకుంటూ వ్యక్తిగత లాభాల కోసం చట్టాలను అతిక్రమించడం సమాజానికి హానికరం అని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పుతో అక్రమ మైనింగ్ కేసులపై చట్టం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో మరోసారి తేలింది.

CBI Court : దోషిగా మైనింగ్ రాజు..హైదరాబాద్ సీబీఐ కోర్టు సంచలన తీర్పు

CBI Court : దోషిగా మైనింగ్ రాజు..హైదరాబాద్ సీబీఐ కోర్టు సంచలన తీర్పు

శిక్ష ఖరారైన తర్వాత వారి చేతిలో ఎలాంటి బెయిల్ లేని పరిస్థితిలో పోలీసులు తక్షణమే చర్యలు చేపట్టారు. వారిని జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే వీరు ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్‌కి వెళ్లే అవకాశాన్ని కోర్టు ఇంకా స్పష్టం చేయలేదు. ఈ కేసు తీర్పు న్యాయవ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించగలదని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.

Also read

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp