Ts Health Employees : ఆరోగ్య శాఖ ఉద్యోగులకు శుభవార్త.. పదవీకాలం పొడిగింపు
ప్రధానాంశాలు:
Ts Health Employees : ఆరోగ్య శాఖ ఉద్యోగులకు శుభవార్త.. పదవీకాలం పొడిగింపు
Ts Health Employees : తెలంగాణలోని వైద్య ఆరోగ్య శాఖకు చెందిన DME విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, గెస్ట్ సర్వీసింగ్, హనోరేరియం, మల్టీటాస్కింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మొత్తం 16 వేల మంది ఉద్యోగుల పదవీ కాలాన్ని 2026 మార్చి 31 వరకు పొడిగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
వీరిలో 4,772 పోస్టుల కాంట్రాక్ట్ బేస్డ్, 8,615 ఔట్ సోర్సింగ్ విధానంలో, 3,056 పోస్టుల గౌరవ వేతన పద్ధతిలో, 5 పోస్టులు MTS ప్రాతిపదికన పని చేస్తున్న ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. ప్రస్తుతం సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉద్యోగులందరూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్, పీహెచ్‌సీలు, బేసిక్ మెడికల్ కళాశాలలు, టీజీఎస్‌సీహెచ్, మల్టీ స్పెషాలిటీ సెంటర్లు వంటి ఆసుపత్రుల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్య సేవల బలోపేతానికి వీరి సేవలు అత్యవసరమైనవని అధికారులు భావించి ఈ పొడగింపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.