Categories: NewsTelangana

Komatireddy Venkat Reddy : హరీశ్‌రావు బీఆర్ఎస్‌కు డిప్యూటీ లీడరా? ఆయ‌న ఏ హోదాతో మాట్లాడుతున్నారు? : మంత్రి కోమటిరెడ్డి

komatireddy venkat reddy : తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మంత్రి కోమటిరెడ్డి, హరీష్‌రావు మధ్య మరోసారి మాటల తూటాలు పేలాయి. హరీష్‌రావు ఏ హోదాలో ప్రశ్నలు అడుగుతున్నారని కోమటిరెడ్డి ప్ర‌శ్నించ‌డంతో పొలిటికల్‌ హీట్‌ నెలకొంది. శాసనసభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు మధ్య వాడీవేడి సంభాషణ జరిగింది. తొలుత మంత్రి మాట్లాడుతూ నల్ల‌గొండ జిల్లాలో నీటి సమస్యను వివ‌రించారు. ఓ వైపు ఫ్లోరైడ్‌, మరోవైపు మూసీ మురుగునీటితో ప్రజలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు. గతంలో కాంగ్రెస్‌ హయాంలో 70 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని, పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పు చేసినా దాన్ని పూర్తిచేయలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. సభలో ఒక మంత్రి లేచి మరో మంత్రిని ప్రశ్నించే పరిస్థితి ఉండకూడదన్నారు. ఇలా ప్రశ్నలు అడిగేందుకు అవకాశమిస్తే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందని. లేని సంస్కృతిని తీసుకురావద్దని స్పీకర్‌ను కోరారు. ఉమ్మడి రాష్ట్రాన్ని ఎక్కువకాలం పాలించింది కాంగ్రెస్‌ పార్టీ.

Komatireddy Venkat Reddy : హరీశ్‌రావు బీఆర్ఎస్‌కు డిప్యూటీ లీడరా? ఆయ‌న ఏ హోదాతో మాట్లాడుతున్నారు? : మంత్రి కోమటిరెడ్డి

మా ప్రభుత్వ హయాంలో ఎస్సారెస్పీ స్టేజ్‌-2 పనులు పూర్తిచేసి కాళేశ్వరం జలాలను ఉమ్మడి నల్ల‌గొండ జిల్లాలో సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ ప్రజలకు అందించాం. దీనిపై చర్చ పెట్టండి.. ఎవరేం చేశారో చర్చిద్దాం. మంత్రులు లేచి రాజకీయ ప్రసంగాలు చేస్తే మేం కలగజేసుకోవాల్సి ఉంటుంది. గతంలో కోమటిరెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలోనే మూసీ ఈవిధంగా తయారైందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.దీనిపై కోమటిరెడ్డి ఘాటుగా స్పందించారు. హరీశ్‌రావు బీఆర్ఎస్‌కు డిప్యూటీ లీడరా? ఎమ్మెల్యేనా? అస‌లు ఏ హోదాతో మాట్లాడుతున్నారు? ఆయనకు ప్రశ్నించే హక్కు లేదు. ప్రతిపక్ష నేత ఏడాదిగా సభకు రాకపోవడం.. తెలంగాణ ప్రజలను అవమానపరచడమే. నల్ల‌గొండ ప్రజల కడుపులో ఆవేదన ఎలా ఉంటుందో చెప్పాను. డబ్బున్న వాళ్లు హైదరాబాద్‌ వచ్చారు. లేని వాళ్లు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. హరీశ్‌రావుకు నల్ల‌గొండ గురించి, త‌న‌ గురించి మాట్లాడే హక్కు లేద‌న పేర్కొన్నారు.

komatireddy venkat reddy మా న‌ల్ల‌గొండ‌ను కాపాడండి..

మా నల్ల‌గొండ దురదృష్టం కింద ఫ్లోరైడ్, పైన మూసీ మా పరిస్థితి దారుణం. మూసీ నీళ్లతో నల్ల‌గొండ ప్రజలు దుర్భ‌రంగా బ‌తుకుతున్నారు. 70 శాతం పూర్తయిన ఎస్ఎల్బీసీ ని పదేండ్లు నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు సీఎంగారు ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. బ్రహ్మణవెల్లంల 11 నెలల్లోనే క్రిందకు నీళ్లు వదిలిపెట్టాం. గందమల్ల పూర్తయితే.. ఆలేరు నియోజకవర్గంలో 1.5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, ఇరిగేషన్ మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి గారు మూసీ శుద్ధీకరణ చేస్తూ మా నల్ల‌గొండ ప్రజలకు మేం బ్రతుకుతామనే ఆశ కల్పించారు. దళితులు, గిరిజనులు, పేదవారు నీళ్లు లేక సచ్చిపోతున్నారు. వారి కోసమే గొంతెత్తుతున్నాను. సహకరించి నల్ల‌గొండ ప్రజలను కాపాడండి. మా నల్ల‌గొండ ప్రజల్ని కాపాడే విషయంలో అందరు సహకరించాలని చేతులెత్తి వేడుకుంటున్న‌ట్లు మంత్రి కొమ‌టిరెడ్డి పేర్కొన్నారు. Harish Rao the deputy leader of BRS asks Minister Komatireddy , Harish Rao, BRS, Minister Komatireddy, Telangana assembly sessions, Telangana assembly , komatireddy Venkat Reddy,

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago