Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం డబ్బులు రావాలంటే ముందు మీరు ఇది క్లియర్ చేసుకోవాల్సిందే !!
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతకు సొంత వ్యాపారం చేయడానికి ఆర్థిక సహాయం అందించేందుకు రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు సబ్సిడీతో కూడిన రుణాలు బ్యాంకుల ద్వారా మంజూరు చేయబడతాయి. జూన్ 2 నాటికి ఈ రుణాలను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది సుమారు 5 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం డబ్బులు రావాలంటే ముందు మీరు ఇది క్లియర్ చేసుకోవాల్సిందే !!
అయితే రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హత సాధించడానికి ఇప్పుడు సిబిల్ స్కోర్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. తక్కువ సిబిల్ స్కోర్ ఉన్న దరఖాస్తుదారులకు రుణాలు తిరస్కరించబడతాయని తెలుస్తోంది. గహంలో వ్యవసాయ, గృహ, వాహన లేదా వ్యక్తిగత రుణాలను తిరిగి చెల్లించని వారికీ ప్రభుత్వం రుణం ఇవ్వదు. ఎవరైతే రుణం చెల్లిస్తారో..ఇప్పటివరకు ఎలాంటి రుణాలు తీసుకోరో వారికే రాజీవ్ పథకం రుణం ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. దీని ద్వారా దాదాపు 60 శాతం మంది అర్హత సాధించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి దరఖాస్తుదారుడి సిబిల్ స్కోర్‌ను బ్యాంకులు తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించింది.
ఈ పథకం కోసం 16,25,441 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎక్కువ భాగం బీసీ వర్గం (5,35,666), ఎస్సీ వర్గం (2,95,908), ఎస్టీ వర్గం (1,39,112) నుంచి వచ్చింది. మైనారిటీ వర్గం నుంచి 1,07,681 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం 70 శాతం దరఖాస్తులను మండల స్థాయి అధికారులు పరిశీలించారు. వెరిఫికేషన్ ప్రక్రియ తర్వాత బ్యాంకు అధికారులు అర్హులను ఎంపిక చేసి, ఈ నెల చివరికి తుది జాబితాను విడుదల చేయనున్నారు.
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
This website uses cookies.