Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం డబ్బులు రావాలంటే ముందు మీరు ఇది క్లియర్ చేసుకోవాల్సిందే !! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం డబ్బులు రావాలంటే ముందు మీరు ఇది క్లియర్ చేసుకోవాల్సిందే !!

 Authored By ramalingaiahtandu | The Telugu News | Updated on :5 May 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం డబ్బులు రావాలంటే ముందు మీరు ఇది క్లియర్ చేసుకోవాల్సిందే !!

Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతకు సొంత వ్యాపారం చేయడానికి ఆర్థిక సహాయం అందించేందుకు రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు సబ్సిడీతో కూడిన రుణాలు బ్యాంకుల ద్వారా మంజూరు చేయబడతాయి. జూన్ 2 నాటికి ఈ రుణాలను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది సుమారు 5 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Rajiv Yuva Vikasam Scheme రాజీవ్ యువ వికాసం డబ్బులు రావాలంటే ముందు మీరు ఇది క్లియర్ చేసుకోవాల్సిందే

Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం డబ్బులు రావాలంటే ముందు మీరు ఇది క్లియర్ చేసుకోవాల్సిందే !!

Rajiv Yuva Vikasam Scheme రాజీవ్ యువ వికాసం పథకానికి సిబిల్ స్కోర్ తో ముడిపెట్టిన రేవంత్

అయితే రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హత సాధించడానికి ఇప్పుడు సిబిల్ స్కోర్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. తక్కువ సిబిల్ స్కోర్ ఉన్న దరఖాస్తుదారులకు రుణాలు తిరస్కరించబడతాయని తెలుస్తోంది. గహంలో వ్యవసాయ, గృహ, వాహన లేదా వ్యక్తిగత రుణాలను తిరిగి చెల్లించని వారికీ ప్రభుత్వం రుణం ఇవ్వదు. ఎవరైతే రుణం చెల్లిస్తారో..ఇప్పటివరకు ఎలాంటి రుణాలు తీసుకోరో వారికే రాజీవ్ పథకం రుణం ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. దీని ద్వారా దాదాపు 60 శాతం మంది అర్హత సాధించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి దరఖాస్తుదారుడి సిబిల్ స్కోర్‌ను బ్యాంకులు తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించింది.

ఈ పథకం కోసం 16,25,441 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎక్కువ భాగం బీసీ వర్గం (5,35,666), ఎస్సీ వర్గం (2,95,908), ఎస్టీ వర్గం (1,39,112) నుంచి వచ్చింది. మైనారిటీ వర్గం నుంచి 1,07,681 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం 70 శాతం దరఖాస్తులను మండల స్థాయి అధికారులు పరిశీలించారు. వెరిఫికేషన్ ప్రక్రియ తర్వాత బ్యాంకు అధికారులు అర్హులను ఎంపిక చేసి, ఈ నెల చివరికి తుది జాబితాను విడుదల చేయనున్నారు.

ramalingaiahtandu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది