
Husband : లంచగొండి భార్యని రెడ్ హ్యాండెడ్‌గా పట్టించిన భర్త...!
Husband : ఈ మధ్య లంచగొండిల భరతం పడుతున్నారు పోలీసులు. పక్కా సమాచారంతో రైడ్ చేయడంతో లక్షలు, కోట్లు కూడా దొరుకుతున్నాయి. అయితే ఇప్పుడు స్వయంగా ఓ భర్త తన భార్య లంచం తీసుకుందంటూ సంచలన ఆరోపణలు చేస్తూ వీడియో తీసాడు. ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భార్య భారీగా లంచాలు తీసుకుంటున్నట్లు ఓ భర్త సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో మున్సిపల్ ఇంజినీర్‌గా పని చేస్తున్న దివ్యజ్యోతిపై ఆమె భర్త శ్రీపాద బుధవారం తీవ్ర ఆరోపణలు చేశారు. గుత్తేదారుల నుంచి ఆమె భారీ ఎత్తున లంచాలు తీసుకొంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా నోట్ల కట్టల వీడియోలను విడుదల చేశారు. రోజూ రూ.లక్షల్లో డబ్బు తీసుకొచ్చి బెడ్రూం, అల్మారాలు, పూజ గదుల్లో దాచిపెడుతున్నట్లు తెలిపారు.
ప్రతి పనికి కమీషన్ కావాలంటూ గుత్తేదారులను బెదిరించి రూ.లక్షల్లో లంచం తీసుకుంటున్నట్లు చెప్పారు. మణికొండ మున్సిపాలిటీలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ)గా విధులు నిర్వహిస్తూ లంచం తీసుకుంటున్న తన భార్య దివ్యజ్యోతిపై భర్త శ్రీపాద్ నాటకీయ పరిణామాలను బయటపెట్టాడు. శ్రీపాద్ తన భార్య పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుంటున్న వీడియోలను రికార్డ్ చేసి, ఆ ఫుటేజీని మీడియాతో పంచుకున్నాడు. శ్రీపాద్ ప్రకారం, దివ్యజ్యోతి క్రమం తప్పకుండా ఇంటికి గణనీయమైన మొత్తంలో డబ్బు తెచ్చేది, ఆమె ఇంటిలో ఎక్కడ చూసినా డబ్బు కట్టలే. ఈ విషయమై వారిద్దరికీ తరచూ గొడవలు జరుగుతుండేవి. అతనిని మాటలతో దుర్భాషలాడేది. ఇక పరిస్థితిని తట్టుకోలేక, శ్రీపాద్ విడాకుల కోసం దరఖాస్తు చేశాడు.
Husband : లంచగొండి భార్యని రెడ్ హ్యాండెడ్‌గా పట్టించిన భర్త…!
ఆమె చట్టవిరుద్ధ కార్యకలాపాలను రికార్డ్ చేయడం ద్వారా విషయాలను తన చేతుల్లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. శ్రీపాద్ అందించిన వీడియోలు దివ్యజ్యోతి అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు చూపుతున్నాయి. ఈ విషయంపై పోలీసులు చర్యలు తీసుకోవలసి ఉంది. ఇంట్లో ప్రతిచోట కట్టల కట్టల డబ్బులు చూపిస్తూ 20 నుంచి 30 లక్షలు తీసుకొస్తుందని ఆమె భర్త చెప్పడం విశేషం. ఎన్నిసార్లు ప్రవర్తన మార్చుకోమని చెప్పినా మార్చుకొక పోవటంతో వీడియోలు మీడియాకు పంపించారు. తన భార్య ఆమె తమ్ముడికి రూ.70 లక్షలు అకౌంట్‌లోకి వేసిందని.. మరో రూ.40 లక్షలు క్యాష్‌గా ఇచ్చిందని చెప్పారు. డబ్బులు ఎక్కువకావడంతో ఇంట్లో ఎవరిని లెక్క చేయట్లేదన్నారు. అంతేకాకుండా భార్యతో మాట్లాడిన ఆడియోలను లీక్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.