Telangana : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడబోతుందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడబోతుందా..?

 Authored By ramu | The Telugu News | Updated on :24 June 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  కాంగ్రెస్ పార్టీ లో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధం అవుతున్నారా..?

  •  మరోసారి తెలంగాణాలో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగబోతున్నాయా..?

  •  మహిళా మంత్రి కారణంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కులబోతుందా..?

Telangana  : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించని రాజకీయ సంక్షోభం పొంచి ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ, పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారనే ఊహాగానాలు జోరుగా చర్చకు రావడం కాంగ్రెస్ శిబిరంలో ఉద్రిక్తతను కలిగిస్తోంది. ఒక మహిళా మంత్రితో నెలకొన్న విభేదాలే ఇందుకు కారణమని సమాచారం. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు స్పష్టంగా తెలిపారు.

Telangana తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడబోతుందా

Telangana : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడబోతుందా..?

Telangana : కాంగ్రెస్ పార్టీ లో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధం అవుతున్నారా..?

సదరు మంత్రి తమ నియోజకవర్గాల్లోకి జోక్యం చేసుకోవడం, ఆమె కుటుంబ సభ్యులు అధికార వాడకంలో హద్దులు మించినట్లుగా వ్యవహరించడంపై ఎమ్మెల్యేలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడిందని, నియోజకవర్గాల్లో తన అధికారాన్ని ఆ మంత్రి దుర్వినియోగం చేస్తున్నారని ఎమ్మెల్యేలు విమర్శించారు. పార్టీ నేతలు స్పందించకపోతే తాము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడమే కాక, ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేస్తామని వారు హెచ్చరించినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర నేతలు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సమాచారం. మంత్రిపై తగిన చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగిందని చెబుతున్నారు. ప్రస్తుతానికి పార్టీ అంతర్గత విభేదాలను బహిరంగంగా రానివ్వకుండా చర్చలతో పరిష్కరించే ప్రయత్నంలో ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ ఆరోపణలపై సదరు మంత్రి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఈ వ్యవహారాన్ని బిఆర్ఎస్ క్యాష్ చేసుకోవాలని చూస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది