Kavitha : ఎమ్మెల్సీ కవిత పై కక్ష్య కడుతున్న సొంత నేతలెవరూ.. కొత్త పార్టీ పెట్టబోతోందా..?

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Published on: May 13, 2025, 4:00 pm
  •  Kavitha : ఎమ్మెల్సీ కవిత పై కక్ష్య కడుతున్న సొంత నేతలెవరూ.. కొత్త పార్టీ పెట్టబోతోందా..?

Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ రాజకీయ వేడి తార స్థాయికి చేరుకుంది. ఇటీవల ఆమె “భవిష్యత్ సీఎం” అంటూ సోదమ్మల చేత జాతకం చెప్పించుకోవడం, కార్యకర్తల మధ్య హర్షధ్వానాల మధ్య సంతోషం వ్యక్తం చేయడం రాజకీయంగా గమనార్హం. ఈ సంఘటనతో ఆమె భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలపై ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారన్న ప్రచారం గత కొన్ని నెలలుగా కొనసాగుతుండగా, తాజా పరిణామాలు ఆ వార్తలకు బలం చేకూర్చుతున్నట్లు కనిపిస్తోంది.

Kavitha : ఎమ్మెల్సీ కవిత పై కక్ష్య కడుతున్న సొంత నేతలెవరూ.. కొత్త పార్టీ పెట్టబోతోందా..?

Kavitha : ఎమ్మెల్సీ కవిత పై కక్ష్య కడుతున్న సొంత నేతలెవరూ.. కొత్త పార్టీ పెట్టబోతోందా..?

Kavitha  కవిత కొత్త పార్టీ పెట్టబోతోందా..?

ఇక ఇటీవల కవిత చేసిన కొన్ని వ్యాఖ్యలు, పార్టీపై తీవ్ర ప్రభావం చూపేలా మారుతున్నాయి. “భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చిందంతే కానీ సామాజిక తెలంగాణ రాలేదు” అన్న ఆమె వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. పార్టీలోనే పలువురు నేతలు ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ, ఇవి పార్టీకి నష్టం చేసే విధంగా ఉన్నాయని భావిస్తున్నారు. పార్టీ అంతర్గతంగా కవిత వ్యవహారం చుట్టూ విభేదాలు ముదిరుతున్నట్టు సమాచారం.

ఇక నిన్న మీడియాతో చిట్ చాట్ లో కూడా కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నాపై ఎవరు దుష్ప్రచారం చేస్తున్నారో నాకు తెలుసు, త్వరలోనే బయట పెడతా” అంటూ ఆమె స్పష్టం చేశారు. అంతేకాక “ఆరు నెలలు జైలులో ఉన్నా, నన్ను ఇంకెంత కష్టపెడతారు?” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలన్నీ ఆమెపై ఉన్న ఒత్తిడి, అలాగే పార్టీతో ఆమె సంబంధాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై స్పష్టతనిస్తున్నాయి. కవిత భవిష్యత్ రాజకీయ దిశ, బీఆర్ఎస్‌పై ఆమె ప్రభావం ఎలా ఉంటుందన్నది త్వరలోనే తేలనుంది. మరోపక్క సొంత పార్టీ నేతలపై ఆమెపై పగ పట్టరాని ప్రచారం నడుస్తుండడం తో ఎవరు ఆ నేతలు..? ఎందుకు పగ పట్టరాని అంత మాట్లాడుకుంటున్నారు.

Ramalingaiah Tandu

No bio available for this author.

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp