Kavitha : ఇడుపు కాయితం అంటే అర్థం పవన్ కల్యాణ్‌కు బాగా తెలుసు.. కవిత సంచలన కామెంట్స్
ప్రధానాంశాలు:
Kavitha : ఇడుపు కాయితం అంటే అర్థం పవన్ కల్యాణ్‌కు బాగా తెలుసు.. కవిత సంచలన కామెంట్స్
Kavitha : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్ చుట్టూ నెలకొన్న వివాదంపై స్పందించిన ఆమె, ఇడుపు కాయితం అనే పదానికి అర్థం తెలుసుకోవాలంటే పవన్ కల్యాణ్‌ను అడగాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కవిత చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఇటీవల నటులు ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘ఇడుపు కాయితం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నిర్మిస్తున్నారు. సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల ఘనంగా నిర్వహించగా, ఈ టైటిల్ సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.

Kavitha : ఇడుపు కాయితం అంటే అర్థం పవన్ కల్యాణ్‌కు బాగా తెలుసు.. కవిత సంచలన కామెంట్స్
Kavitha : ‘ఇడుపు కాయితం’ టైటిల్‌పై చర్చ
‘ఇడుపు కాయితం’ అనే టైటిల్‌ను కొందరు ప్రశంసిస్తుండగా, మరికొందరు ఈ పదానికి అర్థం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కొందరు సోషల్ మీడియాలో ఈ టైటిల్‌పై వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ ట్రోలింగ్‌కు దిగుతున్నారు. దీంతో ఈ పదం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.ఈ వివాదంపై స్పందించిన కవిత, తెలంగాణ భాషను అవమానించేలా ఎవరైనా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
Kavitha : పవన్ కల్యాణ్‌పై కవిత వ్యాఖ్యలు
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, “ఉద్యమ కాలంలో తెలంగాణ భాషపై ఎలా విమర్శలు చేశారో, ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ‘ఇడుపు కాయితం’ అనే సినిమా టైటిల్‌పై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆ పదానికి అర్థం తెలియదని మాట్లాడేవారు సినిమా నటుడు పవన్ కల్యాణ్‌ను అడగండి. దాని అర్థం ఆయనకు బాగా తెలుసు” అని వ్యాఖ్యానించారు.అలాగే తెలంగాణ భాష, సంస్కృతిని అవహేళన చేయడం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరిగిందని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వెకిలి ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు.“ఒకరి భాషను మరొకరు గౌరవించుకోవాలి. ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవించాలి. అందరం కలిసి ఉండాలి. కానీ తెలంగాణ భాషను, సంస్కృతిని కించపరిచే ప్రయత్నాలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు” అని కవిత స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీలపై కూడా విమర్శలు
తెలంగాణ భాషను అవమానించిన సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ స్పందించలేదని కవిత విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదని ఆమె ఆరోపించారు.అలాగే బీజేపీ కూడా తెలంగాణ అంశాలపై స్పందించడం లేదని, జాతీయ అంశాలపైనే దృష్టి పెడుతోందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌లో ఉన్న కొందరు నేతలపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు.
‘ఇడుపు కాయితం’ అంటే ఏమిటి?
‘ఇడుపు కాయితం’ అనేది తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వినియోగించే ఒక సంప్రదాయ పదం. సాధారణంగా భార్యాభర్తలు విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు, పెద్దల సమక్షంలో రాసుకునే విడాకుల ఒప్పంద పత్రాన్ని ‘ఇడుపు కాయితం’గా పిలుస్తారు.తెలంగాణ పల్లెల్లో గతంలో ఈ పదం విస్తృతంగా వినియోగంలో ఉండేది. ఈ నేపథ్యంతోనే చిత్ర బృందం తమ సినిమాకు ఈ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా టైటిల్‌పై కొనసాగుతున్న చర్చతో ‘ఇడుపు కాయితం’ చిత్రం విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.







