Union Budget 2024 : కేంద్ర ఆర్ధిక శాఖా మాత్యులు నిర్మలా సీతారామన్ నేడు వార్షిక బడ్జెట్ ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఐతే ఈ బడ్జెట్ లో ఏపీకి వరాల జల్లు కురిపించిన కేంద్రం తెలంగాణాకు మాత్రం తీవ్ర అన్యాయం చేసింది. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణా ప్రస్తావన లేకపోవడం బాధాకరం అని బిఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్ అన్నారు. రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో భారీ నిధులు వస్తాయన్ ఆశించాం కానీ దక్కింది శూన్యమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ నిధులు కేటాయించినందుకు తనకు ఏమీ బాధ లేదు కానీ మిగతా రాష్ట్రాలను చిన్న చూపు చూడటం సరైనది కాదని అన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై తన సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా కేటిఆర్ స్పందించారు.
కేంద్ర వార్షిక బడ్జెట్ లో భాగంగా 48.21 లక్షల కోట్లతో నేడు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఐతే అంత మొత్తం బడ్జెట్ లో కూడా కేవలం కొన్ని రాష్ట్రాలకే పెద్ద పీట వేశారని అన్నారు. ఈ బడ్జెట్ లో తెలంగాణా రాష్ట్రానికి దక్కింది గుండు సున్నా మాత్రమే అని అన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్న 35 హామీలపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కేసిఆర్ కేంద్రానికి లేఖ రాశారు. తెలంగాణాలో ములుగు యూనివర్సిటీకి, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలకు నిధులు అవసరం ఉన్నాయి. ఐతే ఈ బడ్జెట్ లో అసలు వాటి ఊసే ఎత్తలేదని అన్నారు. తెలంగాణా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నోసార్లు అడిగాం కానీ కేంద్రం దాన్ని పట్టించుకోలేదు. ఐఐఎం సహా పలు కేంద్ర సంస్థలను ఇవ్వాలని కోరినా ఏది ఇవ్వలేదని కేటిఆర్ అన్నారు. తెలంగాణా నుంచి ముంబై నాగ్ పూర్, బెంగళూరు చెన్నై వంటి మార్గాల్లో పారిశ్రామిక కార్డార్లకు నిధులు అడిగితే వాటిని ఇవ్వలేదు.
మెగ పవర్ లూం క్లస్టర్ తో నూతన హ్యాండ్లూం క్లస్టర్ ఏర్పటు చేయాలని కేంద్రాన్ని అడిగితే స్పందించలేదు. తెలంగాణాలో కూడా 16 స్థానాలకు బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలు ఉన్నా ఏమి చేయలేకపోతున్నారని అన్నారు. ఆంధ్ర, బీహార్ రాష్ట్రాలకు దక్కిన నిధులను చూసి తెలంగాణా ప్రజలు ఆలోచన చేయాలని కే టి ఆర్ సూచించారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణాకు శ్రీరామరక్ష అనే విషయాన్ని అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కేటిఆర్ ట్వీట్ వైరల్ గా మారింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.