Union Budget 2024 : కేంద్ర బడ్జెట్ లో తెలంగాణాకు సున్నా.. ట్విట్టర్ లో కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ కేటిఆర్ కామెంట్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Union Budget 2024 : కేంద్ర బడ్జెట్ లో తెలంగాణాకు సున్నా.. ట్విట్టర్ లో కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ కేటిఆర్ కామెంట్స్..!

Union Budget 2024  : కేంద్ర ఆర్ధిక శాఖా మాత్యులు నిర్మలా సీతారామన్ నేడు వార్షిక బడ్జెట్ ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఐతే ఈ బడ్జెట్ లో ఏపీకి వరాల జల్లు కురిపించిన కేంద్రం తెలంగాణాకు మాత్రం తీవ్ర అన్యాయం చేసింది. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణా ప్రస్తావన లేకపోవడం బాధాకరం అని బిఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్ అన్నారు. రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో భారీ నిధులు వస్తాయన్ ఆశించాం కానీ […]

 Authored By ramu | The Telugu News | Updated on :23 July 2024,7:07 pm

ప్రధానాంశాలు:

  •  Union Budget 2024 : కేంద్ర బడ్జెట్ లో తెలంగాణాకు సున్నా.. ట్విట్టర్ లో కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ కేటిఆర్ కామెంట్స్..!

Union Budget 2024  : కేంద్ర ఆర్ధిక శాఖా మాత్యులు నిర్మలా సీతారామన్ నేడు వార్షిక బడ్జెట్ ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఐతే ఈ బడ్జెట్ లో ఏపీకి వరాల జల్లు కురిపించిన కేంద్రం తెలంగాణాకు మాత్రం తీవ్ర అన్యాయం చేసింది. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణా ప్రస్తావన లేకపోవడం బాధాకరం అని బిఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్ అన్నారు. రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో భారీ నిధులు వస్తాయన్ ఆశించాం కానీ దక్కింది శూన్యమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ నిధులు కేటాయించినందుకు తనకు ఏమీ బాధ లేదు కానీ మిగతా రాష్ట్రాలను చిన్న చూపు చూడటం సరైనది కాదని అన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై తన సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా కేటిఆర్ స్పందించారు.

Union Budget 2024 తెలంగాణాకు సున్నా..

కేంద్ర వార్షిక బడ్జెట్ లో భాగంగా 48.21 లక్షల కోట్లతో నేడు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఐతే అంత మొత్తం బడ్జెట్ లో కూడా కేవలం కొన్ని రాష్ట్రాలకే పెద్ద పీట వేశారని అన్నారు. ఈ బడ్జెట్ లో తెలంగాణా రాష్ట్రానికి దక్కింది గుండు సున్నా మాత్రమే అని అన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్న 35 హామీలపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కేసిఆర్ కేంద్రానికి లేఖ రాశారు. తెలంగాణాలో ములుగు యూనివర్సిటీకి, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలకు నిధులు అవసరం ఉన్నాయి. ఐతే ఈ బడ్జెట్ లో అసలు వాటి ఊసే ఎత్తలేదని అన్నారు. తెలంగాణా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నోసార్లు అడిగాం కానీ కేంద్రం దాన్ని పట్టించుకోలేదు. ఐఐఎం సహా పలు కేంద్ర సంస్థలను ఇవ్వాలని కోరినా ఏది ఇవ్వలేదని కేటిఆర్ అన్నారు. తెలంగాణా నుంచి ముంబై నాగ్ పూర్, బెంగళూరు చెన్నై వంటి మార్గాల్లో పారిశ్రామిక కార్డార్లకు నిధులు అడిగితే వాటిని ఇవ్వలేదు.

Union Budget 2024 కేంద్ర బడ్జెట్ లో తెలంగాణాకు సున్నా ట్విట్టర్ లో కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ కేటిఆర్ కామెంట్స్

Union Budget 2024 : కేంద్ర బడ్జెట్ లో తెలంగాణాకు సున్నా.. ట్విట్టర్ లో కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ కేటిఆర్ కామెంట్స్..!

మెగ పవర్ లూం క్లస్టర్ తో నూతన హ్యాండ్లూం క్లస్టర్ ఏర్పటు చేయాలని కేంద్రాన్ని అడిగితే స్పందించలేదు. తెలంగాణాలో కూడా 16 స్థానాలకు బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలు ఉన్నా ఏమి చేయలేకపోతున్నారని అన్నారు. ఆంధ్ర, బీహార్ రాష్ట్రాలకు దక్కిన నిధులను చూసి తెలంగాణా ప్రజలు ఆలోచన చేయాలని కే టి ఆర్ సూచించారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణాకు శ్రీరామరక్ష అనే విషయాన్ని అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కేటిఆర్ ట్వీట్ వైరల్ గా మారింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది