Jagadish Reddy : పేమెంట్లు ఇచ్చి మంత్రి పదవులు తెచ్చుకున్నారు - కాంగ్రెస్ నేతలపై జగదీశ్ రెడ్డి ఆగ్రహం
Jagadish Reddy : కేసీఆర్ హరితహారం ద్వారా రాష్ట్రాన్ని పచ్చదనంతో ముంచెత్తినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం హరిత సంహారం చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందని, విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తోందని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడుతున్నప్పటికీ, కాంగ్రెస్-బీజేపీ కలిసి నాటకం ఆడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములను రాత్రివేళ ఆక్రమించడానికి ప్రయత్నిస్తోందని, విద్యార్థుల నిరసనలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
Jagadish Reddy : పేమెంట్లు ఇచ్చి మంత్రి పదవులు తెచ్చుకున్నారు – కాంగ్రెస్ నేతలపై జగదీశ్ రెడ్డి ఆగ్రహం
400 ఎకరాల భూమి విషయంలో కాంగ్రెస్, బీజేపీ చేతులు కలిపాయని, ప్రభుత్వ పెద్దల కోణం ఇందులో దాగి ఉందని ఆరోపించారు. ఐటీ పార్కుల అభివృద్ధికి భూమి ఉందని, మరి సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా కట్టబెట్టగలరు? అని ప్రశ్నించారు. విద్యార్థుల పోరాటానికి లక్షల మంది మద్దతు తెలపడంతో, దాన్ని పేయిడ్ ప్రచారంగా చిత్రీకరించడం కాంగ్రెస్ తీరును తెలియజేస్తుందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి తెచ్చిన నిధులను కమీషన్ల కోసం వాడుకుంటోందని ఆరోపించారు. హెచ్‌సీయూ లో జరుగుతున్న మారణకాండను ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ మద్దతు కోరడం విద్యార్థుల తప్పేనా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల హక్కులను హరిస్తూ, ప్రజలను మోసం చేస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి హానికరమని ఆయన వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ఎక్కడా కోర్టు తీర్పులను అవమానించలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కించపరుస్తోందని విమర్శించారు.
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
This website uses cookies.