Jagadish Reddy : పేమెంట్లు ఇచ్చి మంత్రి పదవులు తెచ్చుకున్నారు – కాంగ్రెస్ నేతలపై జగదీశ్ రెడ్డి ఆగ్రహం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jagadish Reddy : పేమెంట్లు ఇచ్చి మంత్రి పదవులు తెచ్చుకున్నారు – కాంగ్రెస్ నేతలపై జగదీశ్ రెడ్డి ఆగ్రహం

 Authored By ramu | The Telugu News | Updated on :2 April 2025,5:40 pm

ప్రధానాంశాలు:

  •  Jagadish Reddy : పేమెంట్లు ఇచ్చి మంత్రి పదవులు తెచ్చుకున్నారు - కాంగ్రెస్ నేతలపై జగదీశ్ రెడ్డి ఆగ్రహం

Jagadish Reddy : కేసీఆర్ హరితహారం ద్వారా రాష్ట్రాన్ని పచ్చదనంతో ముంచెత్తినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం హరిత సంహారం చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందని, విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తోందని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడుతున్నప్పటికీ, కాంగ్రెస్-బీజేపీ కలిసి నాటకం ఆడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములను రాత్రివేళ ఆక్రమించడానికి ప్రయత్నిస్తోందని, విద్యార్థుల నిరసనలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

Jagadish Reddy పేమెంట్లు ఇచ్చి మంత్రి పదవులు తెచ్చుకున్నారు కాంగ్రెస్ నేతలపై జగదీశ్ రెడ్డి ఆగ్రహం

Jagadish Reddy : పేమెంట్లు ఇచ్చి మంత్రి పదవులు తెచ్చుకున్నారు – కాంగ్రెస్ నేతలపై జగదీశ్ రెడ్డి ఆగ్రహం

Jagadish Reddy పేమెంట్ మీద పేటెంట్ కాంగ్రెస్ పార్టీదే – మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

400 ఎకరాల భూమి విషయంలో కాంగ్రెస్, బీజేపీ చేతులు కలిపాయని, ప్రభుత్వ పెద్దల కోణం ఇందులో దాగి ఉందని ఆరోపించారు. ఐటీ పార్కుల అభివృద్ధికి భూమి ఉందని, మరి సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా కట్టబెట్టగలరు? అని ప్రశ్నించారు. విద్యార్థుల పోరాటానికి లక్షల మంది మద్దతు తెలపడంతో, దాన్ని పేయిడ్ ప్రచారంగా చిత్రీకరించడం కాంగ్రెస్ తీరును తెలియజేస్తుందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి తెచ్చిన నిధులను కమీషన్ల కోసం వాడుకుంటోందని ఆరోపించారు. హెచ్‌సీయూ లో జరుగుతున్న మారణకాండను ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ మద్దతు కోరడం విద్యార్థుల తప్పేనా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల హక్కులను హరిస్తూ, ప్రజలను మోసం చేస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి హానికరమని ఆయన వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ఎక్కడా కోర్టు తీర్పులను అవమానించలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కించపరుస్తోందని విమర్శించారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది