
jupally krishna rao gives clarity on etela rajender in congress
Jupally Krishna Rao : తెలంగాణలో ఎన్నికల సమరం మొదలైంది. ఎన్నికల హడావుడి మొదలైంది. ఇంకా నెల రోజుల సమయమే ఉండటంతో ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ సందర్భంలోనే కొందరు నేతలు వేరే పార్టీలకు జంప్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ కావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు అనుకున్న చోట టికెట్ రాకపోతే, అసలు టికెటే రాకపోతే ఏమాత్రం ఆలోచించకుండా వేరే పార్టీలోకి వెళ్తున్నారు. అక్కడ టికెట్ హామీ వస్తే చాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేరే పార్టీలో చేరిపోతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు బీఆర్ఎస్, బీజేపీని వీడారు. ఎక్కువగా ఈ పార్టీల నుంచే కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే గులాబీ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పార్టీ డౌన్ ఫాల్ అయింది. అసలు ఒకప్పుడు బీజేపీలో ఉన్న చరిష్మా ఇప్పుడు లేదు. బీజేపీలోకి వలస నాయకులు రావడంతో పాటు బండి సంజయ్ ని తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో బీజేపీ పార్టీ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది.
ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు వరకు రాష్ట్రంలో బీఆర్ఎస్ ను డీకొట్టే సత్తా ఉన్న పార్టీ బీజేపీనే అని అంతా అనుకున్నారు. కానీ.. సడెన్ గా ఏమైందో తెలియదు.. బీజేపీ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. అసలు బీజేపీ పార్టీ గెలవడం పక్కన పెడితే కనీసం ఒక 10 సీట్లు అయినా సాధిస్తుందా అన్న పొజిషన్ కు చేరుకుంది. దీంతో బీజేపీలో చేరిన ఇతర పార్టీల నాయకులు మళ్లీ వేరే పార్టీ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈటల రాజేందర్ చేరి హుజురాబాద్ నుంచి మళ్లీ ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీలో చేరారు. విజయశాంతి, వివేక్ లాంటి కీలక నేతలు కూడా బీజేపీలో చేరడంతో బీజేపీకి ఒక్కసారిగా బలం పెరిగింది. కానీ.. వీళ్లంతా ఆ పార్టీలో చేరిన తర్వాతనే పార్టీలో కొత్తగా గొడవలు మొదలయ్యాయి. పార్టీ పరిస్థితి కూడా దారుణంగా పడిపోవడంతో వేరే పార్టీల నాయకులు కూడా బీజేపీని కాదని కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ లోని కీలక నేతలు కూడా బీజేపీలో కాకుండా కాంగ్రెస్ లో చేరారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీలోకి వలస వచ్చిన నాయకులంతా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన నేతలు కూడా ఈటల పార్టీలోకి వస్తారనే భావిస్తున్నారు. కానీ.. ఈటల పార్టీలోకి రావడం రాకపోవడం అనేది ఆయన ఇష్టం అన్నట్టుగా కొందరు మాట్లాడుతున్నారు. ఈటల పార్టీ మార్పుపై స్పందించిన జూపల్లి కృష్ణారావు.. కాంగ్రెస్ లో చేరడం, చేరకపోవడం అనేది ఈటలకు సంబంధించిన విషయం అని చెప్పుకొచ్చారు. చూడాలి మరి.. ఇప్పటికే బీజేపీ నుంచి ఈటలకు టికెట్ కూడా లభించింది. అయినా కూడా ఈటల.. కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారా? అనేది తెలియాల్సి ఉంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.