KA Paul : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న విషయం తెలిసిందే. యశోద ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. గత వారం తన ఇంట్లో జారి పడటంతో ఆయన తుంటి ఎముక విరిగింది. దీంతో యశోద ఆసుపత్రిలో ఆయనకు ట్రీట్ మెంట్ చేశారు. సర్జరీ విజయవంతం అయింది. ప్రస్తుతం కేసీఆర్ ఆసుపత్రిలోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా డిశ్చార్జ్ చేయలేదు. అయితే.. కేసీఆర్ కు సర్జరీ అయిందని తెలుసుకొని చాలామంది రాజకీయ, సినీ ప్రముఖులు, కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ అభిమానులు యశోద ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు, మెగాస్టార్ చిరంజీవి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఇలా చాలామంది ప్రముఖులు కేసీఆర్ ను పరామర్శించారు. చంద్రబాబు కూడా కేసీఆర్ ను పరామర్శించారు. తనను పరామర్శించడానికి ఎవరూ రావద్దని.. ఆసుపత్రి వద్ద గుమికూడవద్దని.. ఎక్కువ మంది కలిస్తే ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని.. తన మీద చూపిస్తున్న ప్రేమకు తాను ధన్యుడిని అని కేసీఆర్ హాస్పిటల్ బెడ్ మీది నుంచే ఒక వీడియో రిలీజ్ చేశారు.
అయినా కూడా కేఏ పాల్.. కేసీఆర్ ను కలవడానికి వెళ్లారు. కేసీఆర్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేఏ పాల్.. ఇప్పటి వరకు 70 సంవత్సరాల్లో లేనంత క్లోజ్ రిలేషన్ ఇప్పుడు వచ్చింది. కేసీఆర్ దేవుడికి దగ్గరవుతున్నారు. తెలుగు మిత్రులకు కేసీఆర్ అతి త్వరలో సంపూర్ణ స్వస్థత పొందాలని కోరాను. మీరు కూడా ప్రార్థనలు చేశారు. మీ ప్రార్థనలు ఫలమిస్తాయి. డాక్టర్లు, నర్సులు, స్టాఫ్ అందరూ బెస్ట్ వర్క్ చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స కూడా బాగుంది. మళ్ల కేటీఆర్ మానవత్వం, ఆతిథ్యం.. ఆయన హార్ట్ టు హార్ట్ మాట్లాడటం నాకు నచ్చింది. మన జీవితంలో ఏది జరిగినా అన్ని మంచి కొరకే జరుగుతాయి. కేసీఆర్ ఈ విధంగా పడిపోవడం, యాక్సిడెంట్ జరగడం, ఇన్ని రోజులు ట్రీట్ మెంట్ ఏంటి అని అనుకుంటాం. కానీ.. ఆయన దేవుడికి దగ్గరవుతున్నారు.. అంటూ కేఏ పాల్ చెప్పారు.
కేటీఆర్ ను నేను ఇదే మొదటి సారి కలవడం. మా బాండ్ అంత మంచి రిలేషన్ షిప్ ఈరోజు చక్కగా మాట్లాడుకోవడానికి దేవుడు ఇచ్చిన మంచి తరుణం. పాలిటిక్స్ ముఖ్యం కాదు. నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానో కొందరికే తెలుసు. ఈరోజు వారికి అర్థం అయింది ఏంటంటే.. కేటీఆర్ ఒక మంచి ఘటన చెప్పారు. ఏబీఎన్ లో రాధాకృష్ణ నా ఇంటర్వ్యూతో స్టార్ట్ అయింది. ఈ దేశాన్ని ఎందుకు రక్షించాలి. ఎలా రక్షించాలి. ఎవరి నుంచి రక్షించాలి అనేది త్వరలోనే మాట్లాడుతాం. నేను ఒక ఆయిల్ పట్టుకొని నేను మళ్లీ వస్తాను. ప్రేయర్ చేస్తాను. అతి త్వరలో కేసీఆర్ అద్భుతంగా స్వస్థ పొందుతారు. మళ్లీ ఇంతకు ముందు కంటే యాక్టివ్ గా ఉండాలనే స్పెషల్ ఆయిల్ తో వస్తానని చెప్పాను. రాజకీయాలు కొన్ని రోజులు వదిలేయండి… అని కేఏ పాల్ స్పష్టం చేశారు.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.