Kavitha : కొత్త పార్టీతో పాటు పాదయాత్ర కు కవిత సిద్ధం ..?
ప్రధానాంశాలు:
Kavitha : కొత్త పార్టీతో పాటు పాదయాత్ర కు కవిత సిద్ధం ..?
Kavitha : తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. పార్టీ అంతర్గతంగా విభేదాలు బయటపడటంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారి తీస్తోంది. ఈ లేఖ నేపథ్యంలో కవిత పార్టీకి గుడ్ బై చెప్పి కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జూన్ 2న కవిత పార్టీ నుంచి బయటకి వచ్చి కొత్త రాజకీయ బాట పడతారన్న వార్తలతో రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి.

Kavitha : కొత్త పార్టీతో పాటు పాదయాత్ర కు కవిత సిద్ధం ..?
Kavitha : కవిత పాదయాత్ర ప్లాన్ వర్క్ అవుట్ అయ్యేనా…?
కవిత కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన చేయడం లేదని, ఆమె స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్నట్టు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వెల్లడించారు. వైయస్ షర్మిల మాదిరిగా అన్నతో విభేదించి కవిత కూడా కొత్త పార్టీ స్థాపనకు పూనుకుంటున్నారని పేర్కొన్నారు. పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లే వ్యూహాన్ని కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. “పార్టీలో సమస్యలు ఉంటే కుటుంబంలోనే మాట్లాడుకోవచ్చు కదా, మధ్యవర్తుల అవసరం ఏమిటి?” అంటూ బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. ఓటమి ఎదురైన తరువాతే కుటుంబంలో చిచ్చు మొదలవుతోందని ఆయా వ్యాఖ్యలు రాజకీయ వేడి పెంచుతున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా బంజారాహిల్స్‌లోని తన నివాసంలో కవిత తెలంగాణ జాగృతి నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో జాగృతి తరఫున చేపట్టబోయే కార్యక్రమాలపై, రాష్ట్ర రాజకీయాల తాజా పరిణామాలపై చర్చ జరిగినట్టు సమాచారం. పార్టీకి బలమైన యువజన మద్దతు ఉండేలా చర్యలు తీసుకునే దిశగా కవిత ప్రయత్నాలు ప్రారంభించారని భావిస్తున్నారు. ఆమె తాజా రాజకీయ ఆలోచనలు కొత్త పార్టీ పెట్టే దిశగా సాగుతున్న సంకేతాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.