Kavitha : రేవంత్ నిర్ణయానికి జై కొట్టిన కవిత.. ఆ విషయంలో బీఆర్‌ఎస్‌పై తీవ్ర అసంతృప్తి..!
ప్రధానాంశాలు:
Kavitha : రేవంత్ నిర్ణయానికి జై కొట్టిన కవిత.. ఆ విషయంలో బీఆర్‌ఎస్‌పై తీవ్ర అసంతృప్తి..!
Kavitha : తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. గత కొంతకాలంగా ఆమె పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా కనిపించకపోవడం, తన అభిప్రాయాలకు ప్రాధాన్యత లేకపోవడం వంటి కారణాలతో కవిత పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కి ఆమె మద్దతు తెలపడం, అదే సమయంలో బీఆర్ఎస్ నేతల వైఖరిని విమర్శించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Kavitha : రేవంత్ నిర్ణయానికి జై కొట్టిన కవిత.. ఆ విషయంలో బీఆర్‌ఎస్‌పై తీవ్ర అసంతృప్తి..!
Kavitha రేవంత్ సర్కార్ కరెక్టేనంటూ కవిత కామెంట్స్..
తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కి బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారు. కానీ కవిత మాత్రం దీన్ని సమర్థిస్తూ, న్యాయబద్ధమైన నిర్ణయంగా అభివర్ణించారు. ఆమె వ్యాఖ్యల ప్రకారం చట్టసవరణ చేసి తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే మద్దతు తెలిపానని చెప్పారు. ఇక బిఆర్ ఎస్ నేతలు ఎప్పటికైనా నా కాళ్లవద్దకు రావాల్సిందే అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.
Kavitha ఆ విషయంలో బీఆర్‌ఎస్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కవిత
కవిత చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఆమెలో బీఆర్ఎస్ పార్టీపై నెలకొన్న అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమె పేరు సంబంధితంగా మీడియా లోపల బయట వినిపించడమే కాకుండా, అరెస్టు తర్వాత పార్టీ నుండి తగిన మద్దతు లేకపోవడం, పార్టీ కార్యక్రమాల్లో ఆమె పాత్ర తగ్గిపోవడం వంటి అంశాలు కవితను అసంతృప్తికి గురిచేశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇవన్నీ ఆమెను బహిరంగ వ్యాఖ్యలకు ప్రేరేపించిన కారణాలుగా చెబుతున్నారు.
తనను బలపర్చే కార్యక్రమాల్ని స్వయంగా ప్రారంభించి, బీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కవిత నిజానికి పార్టీకి మేలు చేస్తున్నారా? లేక రాజకీయంగా నష్టాన్ని కలిగిస్తున్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. పార్టీ అంతర్గత విషయాలపై బహిరంగంగా వ్యాఖ్యానించడం కేసీఆర్ నేతృత్వంపై కవితకు భరోసా లేకపోవడాన్ని సూచిస్తున్నదా? అనే అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తీన్మార్ మల్లన్న ఆరోపణలపై బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడాన్ని ‘వారి విజ్ఞతకే వదిలేస్తున్నా’ అన్న కవిత వ్యాఖ్యలతో ఆమె అసహనం మరోసారి బహిర్గతమైంది.