Rythu Bharosa : రైతులను నట్టేటా ముంచుతున్న రేవంత్‌ రెడ్డి .. రైతు భరోసా పడేది ఎప్పుడు : కేటీఆర్‌

Authored By Suma | The Telugu News | Updated on : 5 March 2026, 6:00 pm
  •  Rythu Bharosa : రైతులను నట్టేటా ముంచుతున్న రేవంత్‌ రెడ్డి .. రైతు భరోసా పడేది ఎప్పుడు : కేటీఆర్‌

Rythu Bharosa : తెలంగాణలో రైతు భరోసా చెల్లింపులు ఆలస్యం కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. డిసెంబర్‌లో రైతులకు అందాల్సిన డబ్బులు ఇప్పటికీ అందకపోవడంపై ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు.

KTR criticizes delay in rythu bharosa funds

Rythu Bharosa : రైతులను నట్టేటా ముంచుతున్న రేవంత్‌ రెడ్డి .. రైతు భరోసా పడేది ఎప్పుడు : కేటీఆర్‌

Rythu Bharosa : డిసెంబర్‌లో ఇవ్వాల్సిన నిధులు ఇంకా బకాయే

రైతులకు డిసెంబర్‌లో ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులు మార్చి నాలుగో తేదీ వచ్చినా ఇప్పటికీ అందలేదని గుర్తు చేశారు. ఒక్క రూపాయి కూడా రైతుల ఖాతాల్లో జమ కాలేదని ఆయన విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సంవత్సరానికి మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం ఒక పంటకు కూడా రైతు బంధు ఇవ్వడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతులను ఆకట్టుకునేందుకు అనేక హామీలు ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా ఈ పరిస్థితిని గురించి ముందుగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు పథకానికి ప్రమాదం ఏర్పడుతుందని కేసీఆర్ చెప్పారని, ప్రస్తుతం ఆ మాటలు నిజమవుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని గమనించి మేల్కొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Rythu Bharosa : రైతు భరోసా జాప్యంపై బీఆర్ఎస్ విమర్శలు

రైతు భరోసా చెల్లింపుల ఆలస్యంపై బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్ర స్థాయిలో స్పందిస్తోంది. పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శల దాడిని కొనసాగిస్తోంది. డిసెంబర్‌లో ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులను ముందుగా జనవరి మొదటి వారంలో ఇస్తామని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చిందని బీఆర్ఎస్ పేర్కొంది. తరువాత సంక్రాంతి పండుగ నాటికి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని మరోసారి చెప్పారని చివరికి మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారని పార్టీ గుర్తు చేసింది. అయినప్పటికీ ఇప్పటివరకు చెల్లింపులు జరగకపోవడం రైతులను మోసం చేయడమేనని బీఆర్ఎస్ విమర్శించింది.

Rythu Bharosa : కేబినెట్ సమావేశంపై కూడా ఆరోపణలు

ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కూడా రైతు భరోసాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ ఆరోపించింది. రైతుల సమస్యలపై చర్చించకుండా కాంట్రాక్టులు, కమిషన్లకు సంబంధించిన అంశాలపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని విమర్శించింది. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేబినెట్ సమావేశానికి హాజరు కాకపోవడాన్ని కూడా పార్టీ ప్రశ్నించింది. సమావేశం తరువాత కూడా ఆయిల్ పామ్ సాగు, డ్రోన్ స్ప్రే వంటి పథకాల గురించి మాత్రమే ప్రకటనలు చేశారని, కానీ రైతు భరోసా చెల్లింపులపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని బీఆర్ఎస్ పేర్కొంది. రైతులు రైతు భరోసా వస్తుందని నమ్మి అప్పులు చేసి యాసంగి పంటలు సాగు చేశారని ఇప్పుడు ప్రభుత్వం మాట తప్పడంతో వారు ఆందోళనలో ఉన్నారని పార్టీ నాయకులు పేర్కొన్నారు. రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.

 

Advertisement

Suma

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి