KCR : వడ్ల కొనుగోలు విషయమై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. వడ్ల కొనుగోలు విషయంలో స్పష్టతనివ్వాలని గురువారం టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేంద్రంపైన నిప్పులు చెరిగారు.
KCR : దేశ రైతుల తరఫున టీఆర్ఎస్ పోరాడుతుందన్న కేసీఆర్..
గురువారం రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు కేంద్రం వడ్ల కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ‘మహా ధర్నా’ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ‘మహా ధర్నా’ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. కేంద్రం రైతుల పట్ల వ్యతిరేకత చూపుతున్నదని, కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా యుద్ధానికి దిగినట్లు స్పష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం ఇది ప్రారంభం మాత్రమేనని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. పంజాబ్ రాష్ట్రంలో కొన్నట్లు ఇక్కడ కూడా వరి ధాన్యం కొనాలని తాను స్వయంగా కేంద్రాన్ని కోరినట్లు గుర్తుచేశారు. ప్రధాని మోడీకి ఈ విషయమై లెటర్ రాసినప్పటకీ స్పందన లేదని విమర్శించారు. ఈ పోరాటం ఈ రోజుతో ఆగేది కాదని, కేంద్రం దిగొచ్చి రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం ఆగదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఉద్యమం ఉధృతమై ఉప్పెనోలే మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో దిక్కుమాలిన ప్రభుత్వముందని, ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వడ్లు కొంటారా లేదా అనే ప్రశ్నకు కేంద్రం వద్ద సమాధానం లేదని, అది చెప్పకుండా వంకర టింకరగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వడ్ల కొనుగోలు విషయంలో మూడు రోజుల్లో కేంద్రం నుంచి ప్రకటన రాకపోతే యుద్ధం మొదలు పెడతామని కేసీఆర్ హెచ్చరించారు. ఈ క్రమంలోనే దేశంలో నాలుగు లక్షల మెగా వాట్ల విద్యుత్ అందుబాటులో ఉన్నదని, దాంతో 24 గంటల కరెంట్ దేశం మొత్తం ఇవ్వొచ్చని, అలా ఇచ్చినప్పటికీ ఇంకా 2 లక్షల మెగా వాట్ల విద్యుత్ మిగులుగా ఉంటుందని వివరించారు. ఈ విషయం దేశమంతా చెప్పాల్సిన అవసరముందని కేసీఆర్ తెలిపారు.
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్‌లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.