Categories: NewspoliticsTelangana

స్టేజీ ఎక్కుతూనే కెసిఆర్ చెప్పిన మొదటి మాట కి అందరికి మైండ్ బ్లాక్ అయ్యింది

KCR : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ హాలియా లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశాడు . కరోనా నేపథ్యంలో సభ జరపటానికి వీలులేదని తెలంగాణ లోని ప్రతిపక్షాలు కోర్ట్ తలుపు తట్టిన కానీ ఫలితం లేకుండా పోయింది. ఇక ఈ సభలో కేసీఆర్ తన మార్క్ యాసలో దంచికొడుతూ, తెరాస శ్రేణుల్లో ఉత్సహాన్ని నింపే ప్రయత్నం చేశాడు.

మనం కలుసుకోవటం ఇష్టంలేని కొందరు ఈ సభను జరగకుండా చూడటానికి ఎన్నో ఎత్తులు వేశారు.. అది నీచమైన చర్య, ప్రజాస్వామ్యంలో ఇలాంటి సమావేశాలు పెట్టుకొని చేసిన మంచి పనులు చెప్పుకొని మాకు ఓట్లు వేయమని అడగటం హక్కు, దానికి లేకుండా చేయటానికి కొందరు నానా ప్రయత్నాలు చేసిన కానీ మనం కలుసుకోకుండా ఆపేలేకపోయారు. గతంలో హాలియా వచ్చినప్పుడు నేనేమి చెప్పానో గుర్తుపెట్టుకొని ఓట్లు వేయండని చెప్పను.. బిచ్చ‌మెత్తి అయినా వచ్చే ఏడాదిన్నరలో నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో నిర్మించ తలపెట్టిన నెల్లికల్‌ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించనున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. గోదావరి నీటిని పాలేరు రిజర్వాయర్‌ అటునుంచి పెద్దదేవులపల్లి చెరువు ద్వారా పంప్‌ చేసి నాగార్జునసాగర్‌ ఆయకట్టు రైతులకు నీరందిస్తామన్నారు.

అదేవిధంగా దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తలపెట్టిన ఎత్తిపోతల పథకాలను పూర్తిచేస్తామన్నారు. ఇదే కనుక జరగకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన మంచి పనులు, తన వాగ్ధానాలను గమనించి ప్రజలు ఓటేయాల్సిందిగా కోరారు. కారు గుర్తుకు ఓటేసి నోముల భగత్‌ను భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

KCR ముఖ్యమంత్రి పదవి ప్రజల భిక్ష

కేసీఆర్ కు సీఎం పదవి.. జానారెడ్డి పెట్టిన భిక్ష అంటూ ఒకాయన అన్నాడు… ఆ అవకాశమే ఉంటే జానారెడ్డి నాకెందుకు సీఎం పదవి ఇస్తాడు.. ఈ పదవి ఏ నాయకుడు నాకు పెట్టిన భిక్ష కాదు.. ఈ పదవి తెలంగాణ ప్రజలు నాకు పెట్టిన భిక్ష.. పదవుల కోసం పెదవులు మూసుకున్నోళ్ళు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఉద్యమం మొదలుపెట్టిన నాటి నుండే డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి గులాబీ జెండా ఎగరవేశాను. వెనక్కి తిరిగితే రాళ్లతో కొట్టమని ఆనాడే చెప్పను. తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచ మాదిరి వదిలేసాము . పదవుల కోసం తెలంగాణను ఆంధ్రకు కాంగ్రెస్ నేతలు వదిలితే, తెలంగాణ కోసం పదవులు వదులుకున్నవాళ్ళు తెరాస నేతలు. ఆనాడు తెరాస కు ధన బలం, మీడియా బలం లేకపోయిన ధైర్యంగా ముందుకు నడిచాను. వైద్యులు చెప్పిన వినకుండా కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అన్నట్లు పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం.. కాబట్టి ఎవరు ఆగం కాకుండా అలోచించి ఎవరికీ ఓట్లు వేయాలో వేయండి అంటూ కకేసీఆర్ మాట్లాడటం జరిగింది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago