స్టేజీ ఎక్కుతూనే కెసిఆర్ చెప్పిన మొదటి మాట కి అందరికి మైండ్ బ్లాక్ అయ్యింది
KCR : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ హాలియా లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశాడు . కరోనా నేపథ్యంలో సభ జరపటానికి వీలులేదని తెలంగాణ లోని ప్రతిపక్షాలు కోర్ట్ తలుపు తట్టిన కానీ ఫలితం లేకుండా పోయింది. ఇక ఈ సభలో కేసీఆర్ తన మార్క్ యాసలో దంచికొడుతూ, తెరాస శ్రేణుల్లో ఉత్సహాన్ని నింపే ప్రయత్నం చేశాడు.
మనం కలుసుకోవటం ఇష్టంలేని కొందరు ఈ సభను జరగకుండా చూడటానికి ఎన్నో ఎత్తులు వేశారు.. అది నీచమైన చర్య, ప్రజాస్వామ్యంలో ఇలాంటి సమావేశాలు పెట్టుకొని చేసిన మంచి పనులు చెప్పుకొని మాకు ఓట్లు వేయమని అడగటం హక్కు, దానికి లేకుండా చేయటానికి కొందరు నానా ప్రయత్నాలు చేసిన కానీ మనం కలుసుకోకుండా ఆపేలేకపోయారు. గతంలో హాలియా వచ్చినప్పుడు నేనేమి చెప్పానో గుర్తుపెట్టుకొని ఓట్లు వేయండని చెప్పను.. బిచ్చమెత్తి అయినా వచ్చే ఏడాదిన్నరలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నిర్మించ తలపెట్టిన నెల్లికల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. గోదావరి నీటిని పాలేరు రిజర్వాయర్ అటునుంచి పెద్దదేవులపల్లి చెరువు ద్వారా పంప్ చేసి నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులకు నీరందిస్తామన్నారు.
అదేవిధంగా దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తలపెట్టిన ఎత్తిపోతల పథకాలను పూర్తిచేస్తామన్నారు. ఇదే కనుక జరగకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన మంచి పనులు, తన వాగ్ధానాలను గమనించి ప్రజలు ఓటేయాల్సిందిగా కోరారు. కారు గుర్తుకు ఓటేసి నోముల భగత్‌ను భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
KCR ముఖ్యమంత్రి పదవి ప్రజల భిక్ష
కేసీఆర్ కు సీఎం పదవి.. జానారెడ్డి పెట్టిన భిక్ష అంటూ ఒకాయన అన్నాడు… ఆ అవకాశమే ఉంటే జానారెడ్డి నాకెందుకు సీఎం పదవి ఇస్తాడు.. ఈ పదవి ఏ నాయకుడు నాకు పెట్టిన భిక్ష కాదు.. ఈ పదవి తెలంగాణ ప్రజలు నాకు పెట్టిన భిక్ష.. పదవుల కోసం పెదవులు మూసుకున్నోళ్ళు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఉద్యమం మొదలుపెట్టిన నాటి నుండే డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి గులాబీ జెండా ఎగరవేశాను. వెనక్కి తిరిగితే రాళ్లతో కొట్టమని ఆనాడే చెప్పను. తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచ మాదిరి వదిలేసాము . పదవుల కోసం తెలంగాణను ఆంధ్రకు కాంగ్రెస్ నేతలు వదిలితే, తెలంగాణ కోసం పదవులు వదులుకున్నవాళ్ళు తెరాస నేతలు. ఆనాడు తెరాస కు ధన బలం, మీడియా బలం లేకపోయిన ధైర్యంగా ముందుకు నడిచాను. వైద్యులు చెప్పిన వినకుండా కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అన్నట్లు పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం.. కాబట్టి ఎవరు ఆగం కాకుండా అలోచించి ఎవరికీ ఓట్లు వేయాలో వేయండి అంటూ కకేసీఆర్ మాట్లాడటం జరిగింది.
