
Anchor Swecha : యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక మలుపు..!
Anchor Swecha : ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ప్రధాన అనుమానితుడిగా నిలిచిన జర్నలిస్ట్ పూర్ణచందర్ ఎట్టకేలకు మౌనం వీడి పోలీసులకు లొంగిపోయారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో అడ్వకేట్ సమక్షంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో హాజరయ్యారు. స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పూర్ణపై కేసు నమోదు చేసిన పోలీసులు, పలు సెక్షన్ల కింద దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పూర్ణచందర్ ఐదు పేజీల బహిరంగ లేఖను విడుదల చేసి తన స్థానం స్పష్టంచేశారు.
Anchor Swecha : యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక మలుపు..!
లేఖలో పూర్ణచందర్ మాట్లాడుతూ..స్వేచ్ఛతో 2009 నుంచే పరిచయం ఉందని, కానీ సాన్నిహిత్యం 2020 తర్వాత పెరిగిందని పేర్కొన్నారు. స్వేచ్ఛ తన కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రుల తీరును గురించి తరచూ తనతో పంచుకుంటూ వచ్చిందని తెలిపారు. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులు ఆమెను ఒంటరిగా వదిలేసినట్లు చెప్పారు. తల్లిదండ్రుల మధ్య వచ్చే గొడవలు, మానసిక ఒత్తిడి వల్లే స్వేచ్ఛ మానసికంగా అస్థిరతకు గురైందని వివరించారు. స్వేచ్ఛ తన కూతురు అరణ్య భవిష్యత్తుపై ఆందోళనతో ఉండేదని, అందుకే తనపై బాధ్యతలు అప్పగించిందని పేర్కొన్నారు.
పూర్ణచందర్ చెప్పినవన్నీ తనను సమర్థించుకునే ప్రయత్నంగానే కనిపిస్తున్నప్పటికీ, స్వేచ్ఛ తల్లిదండ్రులు మాత్రం ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, మోసం చేశారని స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పటికీ ఈ కేసు మలుపులు తిరుగుతూనే ఉండగా, స్వేచ్ఛ మానసిక స్థితి, వ్యక్తిగత జీవితం, కుటుంబ సంబంధాలు అన్నింటిపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టనున్నారు. పూర్ణచందర్ లేఖతోనే నిజం బయటపడుతుందా లేక మరోవైపు నుండి మరిన్ని ఆధారాలు వెలుగులోకి వస్తాయా అన్నది సమయం చెప్పాల్సిన విషయమే.
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…
Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…
This website uses cookies.