Anchor Swecha : యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక మలుపు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchor Swecha : యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక మలుపు..!

 Authored By ramu | The Telugu News | Updated on :29 June 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు.. పోలీసులకు అసలు విషయాలు చెప్పిన పూర్ణచందర్

  •  Anchor Swecha : యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక మలుపు..!

Anchor Swecha  : ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ప్రధాన అనుమానితుడిగా నిలిచిన జర్నలిస్ట్ పూర్ణచందర్ ఎట్టకేలకు మౌనం వీడి పోలీసులకు లొంగిపోయారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో అడ్వకేట్ సమక్షంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో హాజరయ్యారు. స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పూర్ణపై కేసు నమోదు చేసిన పోలీసులు, పలు సెక్షన్ల కింద దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పూర్ణచందర్ ఐదు పేజీల బహిరంగ లేఖను విడుదల చేసి తన స్థానం స్పష్టంచేశారు.

Anchor Swecha యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక మలుపు

Anchor Swecha : యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక మలుపు..!

Anchor Swecha : యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక మలుపు..!

లేఖలో పూర్ణచందర్ మాట్లాడుతూ..స్వేచ్ఛతో 2009 నుంచే పరిచయం ఉందని, కానీ సాన్నిహిత్యం 2020 తర్వాత పెరిగిందని పేర్కొన్నారు. స్వేచ్ఛ తన కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రుల తీరును గురించి తరచూ తనతో పంచుకుంటూ వచ్చిందని తెలిపారు. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులు ఆమెను ఒంటరిగా వదిలేసినట్లు చెప్పారు. తల్లిదండ్రుల మధ్య వచ్చే గొడవలు, మానసిక ఒత్తిడి వల్లే స్వేచ్ఛ మానసికంగా అస్థిరతకు గురైందని వివరించారు. స్వేచ్ఛ తన కూతురు అరణ్య భవిష్యత్తుపై ఆందోళనతో ఉండేదని, అందుకే తనపై బాధ్యతలు అప్పగించిందని పేర్కొన్నారు.

పూర్ణచందర్ చెప్పినవన్నీ తనను సమర్థించుకునే ప్రయత్నంగానే కనిపిస్తున్నప్పటికీ, స్వేచ్ఛ తల్లిదండ్రులు మాత్రం ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, మోసం చేశారని స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పటికీ ఈ కేసు మలుపులు తిరుగుతూనే ఉండగా, స్వేచ్ఛ మానసిక స్థితి, వ్యక్తిగత జీవితం, కుటుంబ సంబంధాలు అన్నింటిపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టనున్నారు. పూర్ణచందర్ లేఖతోనే నిజం బయటపడుతుందా లేక మరోవైపు నుండి మరిన్ని ఆధారాలు వెలుగులోకి వస్తాయా అన్నది సమయం చెప్పాల్సిన విషయమే.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది