Home » News » Konda Murali Is Giving Rs 5 Lakhs For Surekhas Expenses
News

Konda Murali : కొండా సురేఖ రూ.5 లక్షలు పంపుతున్నాడట.. నిజామా.. వీడియో ?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 19, 2025, 8:00 pm
Advertisement

Konda Murali : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలలో ఒకరిగా ఉన్న కొండా సురేఖ మంత్రి పదవిపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇటీవల కొందరు ఆమెకు మంత్రి పదవి పోతుందన్న ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ ప్రచారంపై ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఘాటుగా స్పందించారు. “రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నపుడు మా సురేఖ మంత్రి పదవి ఎక్కడికి పోతుంది?” అంటూ విమర్శకులపై కౌంటర్ ఇచ్చారు.

Advertisement

Konda Murali : కొండా సురేఖ రూ.5 లక్షలు పంపుతున్నాడట.. నిజామా.. వీడియో ?

Konda Murali : కొండా సురేఖ మంత్రి పదవి పై కొంతమంది పుకార్లు చేస్తున్నారు – కొండా మురళి

ఇక సురేఖకు కేటాయించిన శాఖ ఆర్థిక పరంగా లాభదాయకంగా లేదని స్పష్టం చేశారు. “ఆమెకు కేటాయించిన శాఖలో పైసలు అనేవే లేవు. తానే నెలకు రూ.5 లక్షలు ఇస్తున్నట్లు తెలిపాడు. అయినా ఆమె పని చేస్తున్న తీరు చూసి ప్రతీ ఒక్కరు అభినందిస్తున్నారు” అని తెలిపారు. రాజకీయాల్లో మహిళలు కస్టపడి పనిచేస్తే అటుపైనుంచి వచ్చే ఒత్తిళ్లను తట్టుకొని నిలబడటం చాలా కష్టం అని చెప్పారు. అయినా సురేఖ నిబద్ధతతో పనిచేస్తున్నారని మురళి చెప్పుకొచ్చారు.

Advertisement

కొండా సురేఖ పదవిని పోగొట్టేలా కుట్రలు జరుగుతున్నాయన్న ప్రచారంపై కొండా మురళి స్పందన బలమైన సిగ్నల్ ఇచ్చింది. ఆయన వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్‌లో ఉన్న అగ్రనేతలపై తమకు ఉన్న నమ్మకాన్ని కూడా స్పష్టంగా వెల్లడించారు. ఇవన్నీ చూస్తే కొండా దంపతులు తమకు కేటాయించిన బాధ్యతను నిబద్ధతగా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి