KTR : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హయంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అయితే అధికారంలోకి రాకముందు ఎన్నో చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఖాళీ కుండలు కనిపిస్తున్నాయని పలు సందర్భాలలో తెలియజేశారు. అదే విధంగా కొన్ని బహిరంగ సభల్లో కూడా రేవంత్ రెడ్డి పలు రకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పై సంచల వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ…. రేవంత్ రెడ్డి జీవితాంతం నేను కాంగ్రెస్ లోనే ఉంటా అని ఒక్క మాట చెప్పలేకపోతున్నాడు. ఇక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి ఆ విధంగా మాట్లాడవచ్చా అని కేటీఆర్ మండిపడ్డాడు.
సెక్రెటరీ కి వెళ్లి నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయని వచ్చాను కానీ ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయని అంటున్నాడు. అయితే అసలు లంకె బిందెల కోసం ఎవరు వెతుకుతారు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. లంకె బిందెల కోసం చేతిలో గడ్డపారలు పట్టుకొని ,తలకు తువ్వాల చుట్టుకొని అర్ధరాత్రి పూట దొంగలు తిరుగుతారు. మరి ఈయన ఏం ముఖ్యమంత్రి నాకు అర్థం కావట్లేదు. అలాగే నిన్నగాక మొన్న మహబూబ్ నగర్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొడుకుల్లారా పేగులు మెడలో వేసుకుంటా అన్నాడు. పేగులు మెడలో వేసుకోవటం ఏందిరా హౌలా అని కేటీఆర్ ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నువ్వు అసలు ముఖ్యమంత్రివా లేక బోటి కొట్టేటోడిగా పేగులు మెడలో వేసుకోవటం ఏందిరా అంటూ రేవంత్ రెడ్డి పై కేటీఆర్ మండిపడ్డారు. ఇంకా జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాను అని అంటున్నాడు. జేబులో కత్తిరి పెట్టుకొని జేబు దొంగ మాత్రమే తిరుగుతాడని ఈ జేబు దొంగకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి తప్పు చేశామంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. అంతేకాక అయ్యా రేవంత్ రెడ్డి గారు జేబులో ఉన్న కత్తెర కాస్త జాగ్రత్తగా ఉంచుకోండి కాస్త అటు ఇటుగా అయినట్లయితే మీకే చాలా డేంజర్ అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడం చేతకాట్లేదు కానీ మన ముఖ్యమంత్రికి ఇలాంటి మాటలు బాగా వస్తాయంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. మరి కేటీఆర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Sarvartha Siddhi Yoga : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఖగోళంలో నిర్దిష్ట సమయంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక…
Ysrcp : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందడంతో ఇంకా సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అధికారంలో…
Elon Musk : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఎవరు లాభపడ్డారో తెలియదు కాని…
Stock Market : ఇటీవల స్టాక్ మార్కెట్లు అప్స్ అండ్ డౌన్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే…
Rythu Bharosa : తెలంగా రైతులకు ప్రభుత్వ తీపి కబురు. రైతు భరోసా ఇంకెప్పుడూ అంటూ ఎదురు చూస్తున్న రైతుల…
Telangana Caste Census : తెలంగాణలో కుల ఆధారిత సర్వే ప్రారంభమైంది. తెలంగాణలో Telangana కాంగ్రెస్ Congress నేతృత్వంలోని ప్రభుత్వం…
E Cycle : ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికిల్స్పైన…
AP Govt : అనధికారిక కమ్యూనికేషన్ మరియు అధికారిక పదవిని దుర్వినియోగం చేసినందుకు లెజిస్లేచర్ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ ఎం…
This website uses cookies.