Categories: NewsTelangana

KTR : సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి ఏకీభ‌వించిన కేటీఆర్

KTR  : దివంగత మాజీ భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్ మృతికి సంతాపం తెలపడానికి సోమవారం శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయ‌డం జరిగింది. తెలంగాణ ఏర్పాటుకు ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ చొరవ తీసుకున్నందుకు కృతజ్ఞతగా అసెంబ్లీలో నివాళులర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి Revanth reddy శాసనసభలో తీర్మానం చేయగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బలపరిచారు. ప్రతిపక్షాలు ఈ ప్రతిపాదనకు మద్దతు తెలపాలని భట్టి కోరారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలన్న ప్రతిపాదనకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది.

KTR : సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి ఏకీభ‌వించిన కేటీఆర్

KTR  సంపూర్ణ మ‌ద్ధ‌తు..

తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మన్మోహన్ లాంటి గొప్ప ఆర్థికవేత్త, మానవతావాదికి భారతరత్న ఇవ్వాలన్న నిర్ణయానికి మద్దతు తెలిపారు. మన్మోహన్ సింగ్ గొప్పతనం, ఆయన సామర్థ్యాన్ని ముందుగా గుర్తించిన వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని కేటీఆర్ కొనియాడారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం అయిందన్నారు. గొప్ప ఆలోచనలు ఉన్నవారిని అరుదైన సందర్భం వస్తే ప్రపంచలో ఏ శక్తి ఆపలేదన్నారు. 2024లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుని ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేబినెట్‌లోకి భాగస్వామ్య పక్షాలను కూడా ఆహ్వానించారన్నారు. కేసీఆర్‌కు షిప్పింగ్ పోర్టు పోలియో ఇచ్చారని.. యూపీఏ ప్రధాన భాగస్వామ్యం అయిన డీఎంకే అభ్యంతం లేవనెత్తిందని.. ఆ పదవి తమ పార్టీకి ఇస్తామని చెప్పారని.. ఇప్పుడు కేసీఆర్‌కు ఎలా ఇస్తారని అభ్యంతరం తెలపడంతో.. కేసీఆర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే మన్మోహన్ సింగ్ వద్దకు వెళ్లి తాను వచ్చింది పదవులకోసం కాదని.. ప్రత్యేక తెలంగాణ కోసం వచ్చానని చెప్పి.. పదవి తిరిగి ఇచ్చేశారన్నారు.

చంద్రశేఖరరావు గారు మీరు ఏ నిబద్ధతతో.. సిద్ధాంతో తెలంగాణ రాష్ట్రం కోసం వచ్చారో అది ఫలించాలని నేను కోరుకుంటున్నానని.. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మీకు గుర్తింపు, గౌరవం వస్తుందని, మీరు కర్మయోగిగా గుర్తింపబడతారని’’ అన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఒక గొప్ప ఆలోచనకు.. అరుడైన సందర్భానికి సమయం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ శక్తి దాన్ని ఆపలేదని అన్నారు. మన్మోహన్ సింగ్ నమ్మారు కాబట్టే.. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిబద్దత, బలం, తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తి.. ఇవన్నీ అర్థమైంది కాబట్టే 2014లో అనివార్య పరిస్థితిలో రాష్ట్రం ఏర్పాటు మన్మోహన్ సింగ్ నాయకత్వంలో జరిగిందని కేటీఆర్ తెలిపారు. ఈ విషయాన్ని ఎప్పుడూ మరిచిపోమని అన్నారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago