KTR : 72 గంటల్లో రా.. తేల్చుకుందాం అంటూ రేవంత్ కు సవాల్ విసిరిన కేటీఆర్..!
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డికి 72 గంటల గడువు ఇచ్చి, ఈ నెల 8న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 11 గంటలకు ప్రజల ముందు చర్చ జరపాలని సవాల్ విసిరారు. రైతు సంక్షేమం అంటే బేధజనం చేసే ప్రసంగాలు కాకుండా, సాక్షాలతో కూడిన చర్చ కావాలన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన రైతు పథకాలు, ఉచిత విద్యుత్, రైతు బీమా, రుణ మాఫీలను గుర్తుచేశారు. ఇదే సమయంలో, రేవంత్ రెడ్డి రైతులకు ఏమి చేశారు అనే ప్రశ్నను ప్రస్తావించారు.
KTR : 72 గంటల్లో రా.. తేల్చుకుందాం అంటూ రేవంత్ కు సవాల్ విసిరిన కేటీఆర్..!
రేవంత్ రెడ్డి పాలనలో రైతులు ఎరువుల కోసం కష్టాలు పడుతుండగా, రైతు భరోసా పథకానికి నిధులు సరిగా విడుదల కావడం లేదన్నారు. ఆధార్ చూపిస్తే ఒక్క బస్తా యూరియా మాత్రమే ఇవ్వడాన్ని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో చెరువులు నాశనమైపోయాయని, మిషన్ కాకతీయ ద్వారా వాటికి జీవం పోసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని గుర్తుచేశారు. రైతు బీమా వంటి బీమా పథకాన్ని ప్రపంచంలో ఎక్కడా లేనిదిగా ప్రశంసించారు. రైతులకు పెట్టుబడి, ఉచిత విద్యుత్, చెరువుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు కేసీఆర్ హయాంలోనే సాధ్యమయ్యాయని చెప్పారు.
రెండవ దశ రుణ మాఫీ, కోటి ఎకరాల మాగాణం లక్ష్యం, నల్లగొండ ఫ్లోరైడ్ విముక్తి, మహిళలకు నెలకు రూ.2500, విద్యార్థినిలకు స్కూటీలు వంటి హామీలు కూడా చర్చలో భాగంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. రేవంత్ రెడ్డి వాగ్ధానాలు ఎన్నికల వరకు మాత్రమే ఉంటాయని, తరువాత అమలు విషయంలో ఆలస్యమవుతుందని ఆరోపించారు. సోమాజిగూడలో జరిగే చర్చకు రావాలని, లేకపోతే పారిపోయినట్లే అభిప్రాయపడాలని ఆయన తేల్చిచెప్పారు. “చర్చకు రా రేవంత్.. భయపడకు” అంటూ కేటీఆర్ తన మాటల్లో స్పష్టతనిచ్చారు.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
This website uses cookies.