KTR : 72 గంటల్లో రా.. తేల్చుకుందాం అంటూ రేవంత్ కు సవాల్ విసిరిన కేటీఆర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KTR : 72 గంటల్లో రా.. తేల్చుకుందాం అంటూ రేవంత్ కు సవాల్ విసిరిన కేటీఆర్..!

 Authored By ramu | The Telugu News | Updated on :5 July 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  72 గంటల్లో రా.. తేల్చుకుందాం అంటూ రేవంత్ కు సవాల్ విసిరిన కేటీఆర్

  •  టైం & అడ్డా ఫిక్స్ చేస్తూ రేవంత్ కు సవాల్ విసిరిన కేటీఆర్

KTR  : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డికి 72 గంటల గడువు ఇచ్చి, ఈ నెల 8న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 11 గంటలకు ప్రజల ముందు చర్చ జరపాలని సవాల్ విసిరారు. రైతు సంక్షేమం అంటే బేధజనం చేసే ప్రసంగాలు కాకుండా, సాక్షాలతో కూడిన చర్చ కావాలన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన రైతు పథకాలు, ఉచిత విద్యుత్, రైతు బీమా, రుణ మాఫీలను గుర్తుచేశారు. ఇదే సమయంలో, రేవంత్ రెడ్డి రైతులకు ఏమి చేశారు అనే ప్రశ్నను ప్రస్తావించారు.

KTR 72 గంటల్లో రా తేల్చుకుందాం అంటూ రేవంత్ కు సవాల్ విసిరిన కేటీఆర్

KTR : 72 గంటల్లో రా.. తేల్చుకుందాం అంటూ రేవంత్ కు సవాల్ విసిరిన కేటీఆర్..!

KTR : కేటీఆర్ సవాల్ ను రేవంత్ స్వీకరిస్తారా..?

రేవంత్ రెడ్డి పాలనలో రైతులు ఎరువుల కోసం కష్టాలు పడుతుండగా, రైతు భరోసా పథకానికి నిధులు సరిగా విడుదల కావడం లేదన్నారు. ఆధార్ చూపిస్తే ఒక్క బస్తా యూరియా మాత్రమే ఇవ్వడాన్ని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో చెరువులు నాశనమైపోయాయని, మిషన్ కాకతీయ ద్వారా వాటికి జీవం పోసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని గుర్తుచేశారు. రైతు బీమా వంటి బీమా పథకాన్ని ప్రపంచంలో ఎక్కడా లేనిదిగా ప్రశంసించారు. రైతులకు పెట్టుబడి, ఉచిత విద్యుత్, చెరువుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు కేసీఆర్ హయాంలోనే సాధ్యమయ్యాయని చెప్పారు.

రెండవ దశ రుణ మాఫీ, కోటి ఎకరాల మాగాణం లక్ష్యం, నల్లగొండ ఫ్లోరైడ్ విముక్తి, మహిళలకు నెలకు రూ.2500, విద్యార్థినిలకు స్కూటీలు వంటి హామీలు కూడా చర్చలో భాగంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. రేవంత్ రెడ్డి వాగ్ధానాలు ఎన్నికల వరకు మాత్రమే ఉంటాయని, తరువాత అమలు విషయంలో ఆలస్యమవుతుందని ఆరోపించారు. సోమాజిగూడలో జరిగే చర్చకు రావాలని, లేకపోతే పారిపోయినట్లే అభిప్రాయపడాలని ఆయన తేల్చిచెప్పారు. “చర్చకు రా రేవంత్.. భయపడకు” అంటూ కేటీఆర్ తన మాటల్లో స్పష్టతనిచ్చారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది