Real Life Beggar : వాస్తవ జీవితంలో “బిచ్చగాడు” కథ .. భార్య ఆరోగ్యం కోసం భిక్షాటన చేస్తున్న అడ్వకేట్

 Authored By prabhas | The Telugu News | Updated on :26 February 2026,6:01 pm

ప్రధానాంశాలు:

  •  Real Life Beggar : వాస్తవ జీవితంలో “బిచ్చగాడు” కథ .. భార్య ఆరోగ్యం కోసం భిక్షాటన చేస్తున్న అడ్వకేట్

Real Life Beggar : సినిమాల్లో తల్లి ఆరోగ్యం కోసం కోటీశ్వరుడైన కుమారుడు భిక్షాటన చేసే కథలు మనం చూసి భావోద్వేగానికి లోనవుతాం. అయితే అలాంటి సంఘటన నిజజీవితంలో చోటుచేసుకోవడం అరుదు. అలాంటి హృదయాన్ని కదిలించే ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతానికి చెందిన కాసర్ల జలందర్ రెడ్డి 2006లో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన శిరీషను వివాహం చేసుకున్నారు. పెద్దలు కుదిర్చిన ఈ వివాహం అనంతరం దంపతులు కరీంనగర్‌లో స్థిరపడ్డారు. జలందర్ రెడ్డి అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తుండగా శిరీష ప్రైవేట్ ఉద్యోగం చేసేది. అద్దె ఇంట్లో సాధారణ జీవితం గడుపుతున్న వీరికి సంతానం కలగలేదు.

Lawyer begging for wife health

Real Life Beggar : వాస్తవ జీవితంలో “బిచ్చగాడు” కథ .. భార్య ఆరోగ్యం కోసం భిక్షాటన చేస్తున్న అడ్వకేట్

కాలక్రమేణా శిరీష అనారోగ్యానికి గురయ్యారు. ఆమె చికిత్స కోసం దంపతులు సంపాదించినంత మొత్తాన్ని ఖర్చు చేశారు. అయినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. వైద్యంతో పాటు దైవ విశ్వాసాన్ని ఆశ్రయించాలని భావించిన జలందర్ రెడ్డి, భార్య కోలుకోవాలని సంకల్పంతో వేములవాడ రాజన్న ఆలయం సన్నిధిలో భిక్షాటన చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ దంపతులు ఆలయం వద్ద భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చిన్న చిన్న మనస్పర్థలతో విడిపోతున్న ఈ కాలంలో ఆర్థిక కష్టాలు ఎదురైనా భార్య ఆరోగ్యం కోసం భర్త తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమందిని ఆలోచింపజేస్తోంది. కష్టసుఖాల్లో కలిసి ఉండే దాంపత్య బంధానికి ఇది ఓ ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి