Karimnagar.. రాజన్న ఆలయంలో అభిషేకాలు ప్రారంభం
దక్షిణ కాశీగా పేరుగాంచిన జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి టెంపుల్‌కు భక్తుల రద్దీ ఎప్పుడూ ఉంటుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో మంగళవారం నుంచి అన్నపూజలు, అభిషేకాలు ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా గత కొంత కాలం నుంచి ఆలయంలో అభిషేకాలు, పూజలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలోనే టెంపుల్‌కు ఆదాయం తగ్గిందని అధికారులు చెప్తున్నారు. ఇకపోతే మంగళవారం నుంచి అభిషేకాలు తిరిగి ప్రారంభమవుతున్న సందర్భంగా మళ్లీ ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
కరోనా వల్ల ఆలయం తలుపులు కొన్ని నెలల పాటు క్లోజ్ చేసే ఉన్నాయి. భక్తులు బయట నుంచి దర్శనం చేసుకుని వెళ్లిపోయారు. కరోనా సమయంలో మ్యారేజ్ చేసుకున్న నూతన దంపతులు సైతం వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని బయట నుంచి దర్శనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో టెంపుల్ ఓపెన్ కాగా ప్రజెంట్ భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆర్జిత సేవలు ప్రారంభం అవుతున్నట్లు అధికారులు తెలపడంతో భక్తులు సంతోషపడుతున్నారు.