
malla reddy ready to join in congress party
Malla Reddy : మేడ్చల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరుపున మల్లారెడ్డి గెలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నన్ను గెలిపించిన వాళ్లకు అందరికీ ధన్యవాదాలు. నేను చూసిన పనిని గుర్తించి నన్ను మరోసారి గెలిపించినందుకు వాళ్ల రుణం ఎప్పుడూ మరిచిపోను. వాళ్లకు ఎప్పటికీ సేవ చేసే భాగ్యం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు మల్లారెడ్డి. ఏది ఏమైనా ప్రజల తీర్పును మేము శిరసావహిస్తాం. తప్పకుండా వాళ్లకు కూడా సహకరిస్తాం. వాళ్లు కూడా మంచిగా ఆరు గ్యారెంటీ హామీలు పెట్టారు. అవన్నీ అమలు చేస్తే ప్రజలకు బాగా సంతోషం. ఏం ఇబ్బంది కరం లేదు.. అంటూ మల్లారెడ్డి చెప్పుకొచ్చారు.
మా జిల్లాలో అలా పని చేశాం కాబట్టే ప్రజలు మమ్మల్ని గుర్తించి మా జిల్లాను గెలిపించారు. జిల్లా మొత్తం బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. మా జిల్లాకు మంత్రిగా ఉన్నాను కాబట్టి.. నేను కెప్టెన్ కాబట్టి అట్లా బీఆర్ఎస్ గెలిచింది అంటూ మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీరు కాంగ్రెస్ లోకి వెళ్తారా.. బీఆర్ఎస్ లో ఉంటారా అని ప్రశ్నించగా.. ఇదేం ప్రశ్న అంటూ కొప్పడ్డారు మల్లారెడ్డి. ఇది ప్రజా స్వామ్యం. వాళ్లకూ పాలించే అవకాశం ఇచ్చారు. అందులో తప్పేం ఉంది. వాళ్లు కూడా నడపనివ్వండి అని మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుంది అని అనుకోబోతున్నారు అంటే.. నాకు ఏం అనుభవం లేదు అని చెప్పుకొచ్చారు మల్లారెడ్డి.
నాకు రాజకీయాల్లో అనుభవం లేదు. సడెన్ గా ఎంపీ అయ్యా. సడెన్ గా మంత్రి అయ్యా. సడెన్ గా ప్రతిపక్షంలో కూర్చొంటున్నా.. అంటూ మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. కేబినేట్ లో కూర్చొన్నా.. ప్రతిపక్షంలో కూర్చొన్నా ఒక్కటే నాకు అంటూ మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. ప్రజలు మళ్లీ మీరు మంత్రి కావాలని కోరుకుంటున్నారు అంటే.. ప్రజలకు ఉంటది. పని చేశాం కాబట్టి వాళ్లకు ఉంటది అని చెప్పుకొచ్చారు మల్లారెడ్డి.
PM Svanidhi: చిన్నచిన్న వ్యాపారాలే ఆధారంగా జీవించే వీధి వ్యాపారుల(Street vendors)కు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం…
Business Ideas: ఉద్యోగం దొరకలేదని లేదా చేస్తున్న జాబ్‌లో సరైన ఆదాయం లేదని చాలా మంది యువత(youth) నిరాశ చెందుతున్నారు.…
Today Gold Rate 18 January 2026 : గత కొద్ది రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పెరుగుతూ రావడం…
Ram Charan : టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి సోషల్…
Winter Season : చలికాలం మొదలైతే మన చుట్టూ ఒక విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది. కొందరు మంచు గాలులు వీచినా…
Mouni Amavasya : మాఘ మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్యగా పిలుస్తారు. హిందూ సంప్రదాయాల్లో ఈ తిథికి విశేషమైన…
Zodiac Signs January 18 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
Kavitha : ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఏదో ఒక అంశం నిత్యం సోషల్ మీడియా, ప్రధాన మీడియాల్లో చర్చనీయాంశంగా మారుతూనే…
This website uses cookies.